దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంపుతామంటూ బెదిరింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా భారత ప్రథమ పౌరుడైన ప్రధానికి ఇలాంటి బెదిరింపులు రావడమనేది దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక విషయం ఏంటంటే..? బుధవారం పంజాబ్ రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో భాగంగా ఆయనకు చుక్కుదురైంది.
మోదీ ఓ సభలో పాల్గొనాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన సభకు బయలుదేరారు. దీంతో మాటు వేసిన కొందరు నిరసనకారులు ప్రధాని వెళ్లే రోడ్డుకు అడ్డంగా కొన్ని ట్రక్కులతో నిరసన తెలియజేశారు. దీంతో ప్రధాని కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక ఆ రాష్ట్ర భద్రత సాయంతో అక్కడి నుంచి ప్రధాని బయలుదేరారు. ఇదే ఘటనపై కొందరు బీజేపీ నేతలు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.ఇలా నిరసనకారులు నిరసన తెలియజేయడంపై ఉగ్రవాదుల హస్తం ఉందన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇక దీంతో పాటు పీఎం పర్యటనలో భద్రత లోపంపై విచారణ చేయాలంటూ లొయాస్ వాయిస్ అనే సంస్థ పిల్ దాఖలు చేసింది. దీనిపై విచారణకు భారత ప్రధాని న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీరమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టులోని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాదికి ఈ పిల్ కాపీని అందజేయాలని పటిషనర్ ఆదేశించింది.
తదుపరి విచారణ శుక్రవారం జరుగుతుందని తెలిపింది. అయితే ఈ నేపథ్యంలోనే ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఏకంగా ప్రధానికి వార్నింగ్ ఇస్తూ చంపుతామంటూ బెదిరింపులకు గురి చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే మోదీకి పడుతుందంటూ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేయటం విశేషం. ప్రధానికి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఇచ్చిన ఓపెన్ వార్నింగ్ తాజాగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ప్రధానికి వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.