Snake Skin: తినే వస్తువుల్లో, తాగే పానియాల్లో చనిపోయిన జంతువుల కళేబరాలు రావటం చాలానే చూసుంటాం. తాజాగా, ఓ పరోటా పార్శిల్‌లో ఏకంగా పాము చర్మం వెలుగు చూసింది. హోటల్‌నుంచి పార్శిల్‌ను ఇంటికి తెచ్చుకున్న ఓ కస్టమర్ అందులో పాము చర్మం చూసి షాక్ అయ్యింది. హోటల్ వాళ్లను తిట్టుకుని, పార్శిల్ చెత్త బుట్టలో పడేసి ఊరుకోలేదు. అధికారుల సహాయంతో సదరు హోటల్‌పై చర్యలు తీసుకుంది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ, తిరువనంతపురానికి చెందిన ప్రియ గురువారం అక్కడి చందముక్కు హోటల్‌లో రెండు పరోటాలు ఇంటికి పార్శిల్ తీసుకెళ్లింది. రెండు పరాటాల్లో ఓ పరోటాను కూతురు తినేసింది. మిగిలిన ఒక్క పరోటాను ప్రియ తినటం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పార్శిల్‌లో పాము చర్మం ఉండటం ఆమె చూసింది.
దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. ఆమె ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఆ హోటల్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే షో కాజ్ నోటీసులు ఇచ్చి హోటల్‌ను తాత్కాలికంగా మూసేశారు. న్యూస్ పేపర్ ప్యాకింగ్‌లో పాము చర్మం ఉన్నట్లు తేల్చారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sneha Sirivara: లక్ష జీతం వచ్చే జాబ్ వదిలేసి.. చిన్న ఆలోచనతో నెలకు 5 లక్షలు సంపాదిస్తోంది!