సాధారణంగా ఎవరైన కంప్యూటర్ కోర్సు ఒకటి, రెండు.. మహా అయితే ఓ పది నేర్చుకుంటారు. అయితే మరికొందరు మాత్రం కొన్ని సంవత్సరాలు టైమ్ తీసుకోని పదుల సంఖ్యలో కోర్సులు నేర్చుకుంటారు. కానీ ఓ యువతి మాత్రం కేవలం 24 గంటల్లోనే 81 కోర్సులను పూర్తి చేసింది. గంట సేపు అదే పనిగా కంప్యూటర్ ముందుకు కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా 24 గంటల పాటు అదే పనిగా కూర్చొని ఈ 81 కోర్సులు పూర్తి చేసి వరల్డ్ రికార్డు సాధించించింది ఆ యువతి. వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన ఈ 25 ఏళ్ల రెహానా అత్యధిక ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసింది. ఈ రికార్డు కోసం రెహానా బహ్రైన్ వెళ్లింది. అక్కడ ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్క్ మొదలైన నుంచి ఆన్‌లైన్ సర్టిఫికెట్లు పొందింది. కేవలం 24 గంటల్లోనే 81 కోర్సులను పూర్తి చేసి సర్టిఫికెట్స్ సంపాదించింది. అయితే ఈ రికార్డ్ వేటను ఉదయం 8గంటలకు మొదలుపెట్టిన రెహానా.. రాత్రి 11 గంటలకు 66 సర్టిఫికెట్లు సాధించింది. అయితే వరల్డ్ రికార్డు లో కొట్టాలంటే.. గంటలో మరో 9 కోర్సులు పూర్తి చేయాలి. ఒకానోక దశలో తన వల్లకాదని విడిచిపెట్టాలని భావించి. అయితే ఇంత వరకు పడ్డ కష్టం వృధా అవుతుందని భావించింది. వెంటనే మిగిలిన ఆ ఒక గంటలోనే తొమ్మిది కోర్సులు పూర్తి చేసింది.
వాతో పాటు ఇంకొన్ని కోర్సులు కూడా పూర్తి చేసింది. సర్టిఫికెట్ రావాలంటే.. ఒక్కో కోర్సులో 70శాతం మార్కులు రావాలి. అన్ని కోర్సుల్లోనూ 70 శాతం మార్కులూ సాధించింది. రెహానా దుబయ్‌లోని ఓ కంపెనీ హెచ్‌ఆర్‌గా పనిచేస్తుంది. తండ్రి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకోసం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటీవలే ఇండియా వచ్చింది. విద్యార్థులకు కెరీర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్‌గా పనిచేస్తోంది. ఆన్‌లైన్ కోర్సులెేలా చేయాలో గైడ్ చేస్తోంది. అయితే తనకు ఇలా కోర్సులు పూర్తి చేయాలనే కసి ఆమె చెల్లెలి నుంచి వచ్చింది. రెహానా సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. చెల్లిలా ఏదైనా ఓ పెద్ద సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలన్నది ఆమె కల.
ఈక్రమంలో ఇస్లామియాలో ఎంకామ్ ప్రవేశ పరీక్ష రాసింది. అయితే హాఫ్ మార్కుతో సీటు కోల్పోయింది. దీంతో యూనివర్సిటీలో చేరాలంటే మరో ఏడాది ఆగాల్సి ఉంటుంది. దీంతో అంత సమయం వృధా చేయడం ఇష్టం లేక ఎమ్ఎస్ డబ్ల్యూ, పీజీ డిప్లోమా డిస్టెన్స్ కోర్సులో చేరింది. ఆ తరువాత కరోనా సమయంలోనే రెహాన ఎంబీఏ పూర్తి చేసింది. ఇంటర్వ్యూలకు వెళ్తే.. కోవిడ్ టైమ్‌ను ఎలా ఉపయోగించుకున్నావని అడిగారు.
అప్పుడు అందరిలో ఒకరిగా మిగిలిపోకూడదు అనేది తన వ్యక్తిత్వం అని.. అందుకే ఎంబీఏ పూర్తైన తరువాత ఒక రోజులో 55 ఆన్ లైన్ కోర్సులు నేర్చుకున్నాను అని తెలిపింది. ఆశ్చర్య పోయిన ఇంటర్వ్యూర్ వరల్డ్ రికార్డ్‌కు ఎందుకు ట్రై చేయకూడదని ఓ సలహా ఇచ్చారు. అలా 24 గంటల్లో 81 కోర్సులు పూర్తి చేసి అందరికి ఇలా స్ఫూర్తిగా నిలిచింది రెహానా. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#World record.. 81 certificates in 24 hours!
Rehna Shahjahan from Kerala created a world record. Received certificates for 81 courses in just 24 hours. A few years ago, Rehna tried for an https://t.co/9wTkWurn04 seat in Jamia Millia Islamia but did not get a chance. pic.twitter.com/AzyNRYcNtA— me.. (@urs1ly) September 2, 2022