సాధారణంగా దొంగతనాలు జరిగితే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే.. దొంగిలించిన సొత్తు దొరకడం కష్టం. కొందరి విషయంలో ఏళ్ల తరబడి ఎదురు చూసినా ఫలితం ఉండదు. కానీ అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవసరం నిమిత్తమో లేక మరే ఇతర కారణాల వల్లనో దొంగతనాలు చేసే కొందరు.. చాలా కాలం తర్వాత తప్పు తెలుసుకుని.. తిరిగి వాటిని అప్పగించే సంఘటనలను ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఏళ్ల క్రితం 700 రూపాయల విలువ చేసే సొమ్ము దొంగిలించిన ఓ వ్యక్తి.. ఇలానే పశ్చాతాపం పొంది.. తిరిగి ఇచ్చేశాడు. తనను క్షమించనమి కోరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఉత్తర నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ వింత సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వయనాడ్ జిల్లా పుల్పల్లి సమీపంలోని పటనికూప్ ప్రాంతంలో మేరీ అనే మహిళ నివసిస్తోంది. ఆమె భర్త జోసెఫ్ పదేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో బుధవారం మేరీకి ఓ లేఖ వచ్చింది. క్రిస్మస్ సమయంలో బంధువులు, స్నేహితుల నుంచి గ్రీటింగ్స్ తప్ప తనకు వేరే ఇతర సందర్భాల్లో ఎప్పుడు ఇలా పోస్ట్‌లో ఎలాంటి ఉత్తరాలు రాలేదు. ఇంత సడెన్‌గా లెటర్ రావడం ఏంటని మేరీ ఆశ్చర్యపోయింది.
లెటర్‌ని పరిశీలిస్తే.. దాని మీద ఎలాంటి అడ్రెస్ లేదు. దాంతో మొదట ఉత్తరం తెరవడానికి మేరీ కాస్త భయపడింది. అనుమానంగానే కవర్ తెరిచి చూసింది. దానిలోపల ఓ లేఖ, కొంత డబ్బులు ఉన్నాయి. అన్ని 500 రూపాయిల నోట్లు. వాటిని పక్కకు పెట్టి.. లెటర్ చదవసాగింది మేరీ. దానిలో ఉన్న మాటర్ చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
ఇంతకు లెటర్‌లో ఏం ఉంది అంటే.. ‘‘ప్రియమైన మేరీ అక్క.. చాలా ఏళ్ల క్రితం నేను మీ భర్త జోసెఫ్ దగ్గర 700 రూపాయల విలువైన వస్తువులు దొంగిలించా. ఇప్పుడు వాటి విలువ 2000 రూపాయల వరకు ఉంది. ఈ లేఖతో పాటు ఆ డబ్బులు కూడా పంపుతున్నాను. ఇవి తీసుకుని నన్ను క్షమించండి’’ అని రాసి ఉంది. దాని మీద ఎలాంటి పేరు, చిరునామాలు లేవు. ఇక మేరీ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నా భర్త మరణించాడు. కనుక ఈ సంఘటన గురించి నాకు ఏం తెలియదు. కానీ దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం పొందాడు అది చాలు. మిగతావారు కూడా ఇలానే పశ్చాత్తాపం పొందితే బాగుంటుందని’’ మేరీ ఆశాభావం వ్యక్తం చేసింది. మరి ఈ విచిత్ర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
kerala-wayanad-thief-returns-stolen-cash-with-apology-letter-after-years pic.twitter.com/F0GNjyMTCZ
— Sekhar Rambo (@RamboSekhar) August 13, 2022