కేరళ కు చెందిన టాన్స్ జంట జియా, జహద్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల గర్భం దాల్చినట్లు ప్రకటించిన ఈ దంపతులు బుధవారం ఉదయం 9.30 ప్రాంతంలో బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తండ్రి, బిడ్డల ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. హా.. తండ్రి బిడ్డకు జన్మనివ్వడం ఏంటా అనుకోకండి..! వీరు లింగమార్పిడి చేసుకున్న దంపతులు. జియా పుట్టుకతోనే మగవాడు కాగా లింగమార్పిడి చేయించుకునిస్త్రీగా మారింది. ఇక జహద్ పుట్టుకతోనే అమ్మాయి కాగా లింగమార్పిడితో అబ్బాయిగా మారాలనుకుంది. ఆందుకోసం.. ఇదివరకే శస్త్రచికిత్స ద్వారా తన వృక్షోజాలను కూడా తొలగించుకుంది.
అయితే, ఆ తర్వాత ప్రక్రియ జరిగే లోపు గర్భం దాల్చడంతో లింగ మార్పిడి ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. తాజాగా, ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతానికి తండ్రి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించనప్పటికీ.. బేబీ జెండర్ రివీల్ చేసేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటంలేదని తెలుస్తోంది. దేశ చరిత్రలో తొలిసారి ఓ టాన్స్ పురుషుడు బిడ్డకు జన్మనివ్వటం ఇదే మొదటిసారి. కాగా, ఇటీవల ఈ జంట తల్లిదండ్రులం కాబోతున్నామంటూ బేబీ బంప్‌తో చేసిన ఫోటోషూట్ వైరలయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.