ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకురావడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు చరిత్ర గురించి తెలియాల్సిన అవసరం ఎంతో ఉన్న సమయంలో వారి చరిత్రలను పాఠ్యాంశాల నుంచి తీసీవేయడం పై పలువురు నేతలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకు రావడంపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలో విద్యార్థుల సంఘం ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకు వచ్చినందుకు వ్యతిరేకంగా కేరళ విద్యార్థి సంఘం సోమవారం ఏజీ కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. నిసనకారుల గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీలు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో మార్పులు తీసుకొచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ఈ మార్పులు చరిత్రను తిరగరాసి అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నమని కేరళ సీఎం పినరయి విజయన్ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులపై కేరళ సీఎం ట్విటర్‌లో స్పందిస్తూ, “ పుస్తకాల్లో మార్పు తీసుకు రావడంతో సంఘ్‌పరివార్ తమ అసలు రంగులను బయటపెడుతుంది.. చరిత్రను తిరగరాయడం, అబద్ధాలతో కప్పిపుచ్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కేంద్రం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని.. ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుండి కొన్ని సెక్షన్‌లను తొలగించాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. సత్యాన్ని గెలిపించండి.” అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల ఎన్‌సిఇఆర్‌టి 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి మొఘల్ సామ్రాజ్యంపై కొన్ని అధ్యాయాలను తొలగించింది. ఇటీవలి మార్పులన్నీ ప్రస్తుత విద్యా సెషన్ 2023-2024 నుండి వర్తిస్తాయని ఎన్‌సిఇఆర్‌టి తెలిపింది. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
#WATCH | Police use water cannons & tear gas as members of the Kerala Student Union protest outside AG’s office against alleged saffronisation of NCERT textbooks, in Thiruvananthapuram pic.twitter.com/ogb6bUzlQJ
— ANI (@ANI) April 17, 2023
The Sangh Parivar lives in constant fear of history as it exposes their true colours. They resort to rewriting history and masking it with lies. So we must strongly protest the decision of the BJP government to delete certain sections from NCERT textbooks. Let the truth prevail.
— Pinarayi Vijayan (@pinarayivijayan) April 7, 2023