ఇటీవల కాలంలో దేశంలో పలు చోట్ల మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి. పలు అవమానకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతమైన విద్యనభ్యసించడానికి ప్రవేశ పరీక్ష కోసం హాజరయ్యేందుకు వచ్చిన యువతుల పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది.
కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ నీట్ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తామని చెప్పారు. అయితే.. ఎన్టీఏ మార్గదర్శకాల్లోని డ్రెస్‌కోడ్ ప్రకారం.. ఎలాంటి మెటల్ వస్తువులు ఒంటిపై కనిపించకూడదు.. అలా ఉంటే ఎగ్జామ్స్ కి అనుమతించరు. ఈ క్రమంలో కొంత మంది అమ్మాయిలను లోదుస్తులు విప్పించి పరీక్ష కేంద్రంలోకి పంపించారు.
ఎగ్జామ్ హాల్ కి ఎంతో అవమానంగా వెళ్లిన విద్యార్థినులు పరీక్ష ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పి బాధపడ్డారు. దీంతో తమ పిల్లల పట్ల ఇంత ఘోరంగ ప్రవర్తించినందుకు యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తాము ఎంతో మానసికంగా కృంగిపోయామని విద్యార్థినులు ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఆరోపణలు మార్థోమా కాలేజీ కొట్టిపడేసింది.. తమ కాలేజ్ లో పరీక్షలు నిర్వహించేందుకు మాత్రమే పరిమిషన్ ఇచ్చామని.. తనిఖీలకు సంబంధించిన విషయాలు వేరేవాళ్లు చూసుకున్నారని.. తమ కాలేజ్ పై నిందలు వేయడం తగదని అన్నారు. ఇక తిరువనంతపురంలో నీట్ రాసే విద్యార్థినుల లో దుస్తులు విప్పించిన సెంటర్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది చదవండి: Hyderabad: రూ.3 వేల కోసం ఇలా చేశావేంటి తల్లి? పిల్లలను కూడా కాదని!