ప్రస్తుత కాలంలో చదవడం.. ఆ తర్వాత దానికి తగ్గ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంత కష్టమే తెలుస్తూనే ఉంది. ఇక చాలామంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటారు. దాని కోసం ఎన్నో ఏళ్లు.. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడతారు. కానీ కొద్ది మంది మాత్రమే ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఇక కుటుంబంలో ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారంటేనే.. చాలా గొప్పగా భావిస్తారు. అలాంటిది ఇద్దరికి ఒకేసారి గవర్నమెంట్ జాబ్ వస్తే.. అది కూడా తల్లి, కుమారులకు ఇద్దరికి వస్తే.. చదువుతుంటేనే భలే ఆసక్తిగా ఉంది. మరి ఇంతకు ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన ఆ తల్లి కుమారులు ఎవరు.. వారి వివరాలు..
కేరళలోని మలప్పురానికి చెందిన బిందు(42) అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తుంది. ఆమె కుమారుడు పదో తరగతి పరీక్షల కోసం చదువుకుంటుండగా.. బిందు కూడా కొడుకుతో పాటు పుస్తకం చేతబట్టి చదవడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఆమెకు చదువు మీద ఆసక్తి పెరిగింది. అలా పోటీ పరీక్షలకు చదవడం ప్రారంభించింది. కోచింగ్ కూడా తీసుకుంది. అయితే మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమయ్యింది. కానీ నిరాశ చెందకుండా.. ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో నాలుగోసారి విజయం ఆమెను వరించింది. తాజాగా లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్‌ఎస్‌జీ) ఉద్యోగానికి సెలక్టయ్యింది బిందు.
ఇక డిగ్రీ పూర్తి చేసిన బిందు కుమారుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుని.. చదవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడు కూడా లోవర్ డివిజనల్ క్లర్క్(ఎల్‌డీసీ) ఉద్యోగం సాధించాడు. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పట్టువదలకుండా ప్రయత్నిస్తే.. విజయం దక్కతుంది అంటుంది బిందు. ఒకేసారి ప్రభత్వు ఉద్యోగం సాధించిన ఈ తల్లి కుమారులపై పట్టుదలపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.