సామాన్యంగా రాజకీయ నాయకులు అంటే.. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జనాల వెంట తిరుగుతారు. దండాలు, దస్కాలు పెట్టి.. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి… అవసరమైతే ఓటర్ల కాళ్లు పట్టుకుని మరీ బతిమిలాడతారు. ఇక ఎన్నికల్లో గెలిచాక.. వారి అసలు స్వరూపం బయటపడుతుంది. ఎన్నికల ముందు వరకు జనాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నేతులు.. ఎలక్షన్ తర్వాత వారికి అసలు అందుబాటులో ఉండరు. ఉన్నా.. ప్రజలను కలుసుకునేందుకు ఇష్టపడరు. సమస్యలతో సమతమయ్యే ప్రజలు రోజుల తరబడి వారి వెంట తిరిగినా ఫలితం శూన్యం. అయితే అందరు నేతలు ఇలానే ఉంటారా అంటే ఉండరు. కొందరు నాయకులు సామాన్యుల కష్టాలు చూసి చలించిపోతారు. వెంటనే వారిని ఆదుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కిడ్నీ బాధితుడి కష్టం చూసి చలించిన మహిళా మంత్రి ఒకరు వెంటనే తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి అతడికి ఇచ్చింది. మినిస్టర్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.
కేరళ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆర్. బిందు సామాన్య వ్యక్తి కష్టాలు చూసి.. చలించి తన గాజులు తీసి ఇచ్చి మంచి మనసు చాటుకుంది. రెండు రోజుల క్రితం బిందు త్రిసూర్‌లోని ఇరింజళకుడ వద్ద జరిగిన ఓ మెడికల్ ఎయిడ్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివేక్ ప్రభాకర్ అనే కిడ్నీ బాధితుడు కూడా పాల్గొన్నాడు. వివేక్ ప్రభాకర్ దాతల సాయం కోసం చూస్తున్నాడు.
అతడి దీనగాధను స్వయంగా విన్న మంత్రి ఆర్. బిందు చలించిపోయింది. అతడి కష్టాన్ని విని కరిగిపోయారు. వెంటనే తన చేతులకున్న గాజుల్లో ఒకదానిని తీసి వివేక్ ప్రభాకర్‌కు ఇచ్చారు. దాంతో అక్కడున్న వారంతా మంత్రి ఔదార్యానికి ముగ్దులయ్యారు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.