మన దేశంలో రోడ్లపై గుంతలు సర్వ సాధారణం. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేసినా లాభం ఉండదు. ఎందుకంటే కాంట్రక్టర్లు.. తమ జేబులు నింపుకోవడానికి ఆలోచిస్తారు తప్ప.. దాని వల్ల ప్రజలకు కలిగే ఇబ్బంది వారికి పట్టదు. ఇక రాజకీయ నేతలు ఏదో ఆర్భటంగా ప్రకటనలు చేయడమే తప్ప.. చేసేది ఏం ఉండదు. రోడ్ల మీద గుంతల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో ఎవరికి పట్టదు. దీని గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా లాభం ఉండదు. ఈ క్రమంలో రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఓ యువకుడు వినూత్న మార్గం ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంభంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
కేరళలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేశాయి. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు పూర్తిగా పాడయిపోయాయి. ముఖ్యంగా మలప్పురం సిటీ ప్రాంతంలోని రోడ్ల మీద ఉన్న గుంతల కారణంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక కొన్ని రోజుల క్రితం ఎర్నాకులం జిల్లా నెడుంబసేరి జాతీయ రహదారిపై ఉన్న గుంతలో పడి 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. కిందపడగానే లారీ అతడిపై నుంచి దూసుకెళ్లింది.
ఇదే పరిస్థితి మలప్పురంలో రాకూడదని ఓ యువకుడు రోడ్ల మీద ఉన్న గుంతలపై వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రోడ్డుపై నిలిచిన బురద నీటిలో దిగి.. ముందుగా తన బట్టలు ఉతుకున్నాడు. ఆ నీటిలో కూర్చొని ధ్యానం చేశాడు. అంతటితో ఆగక ఏకంగా స్నానం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఈ విషయం కాస్త స్థానిక ఎమ్మెల్యే దృష్టికి చేరింది. వెంటనే ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి నిరసనను గమనించి.. అతడితో మాట్లాడారు. నియోజక వర్గంలోని రోడ్లను వెంటనే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారం రోజుల్లోగా రోడ్లను బాగు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఆదేశించింది. యువకుడి ప్రయత్నంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
రోడ్డుపై గుంతలో స్నానం చేసి, బట్టలు ఉతికి.. యోగా ఆసనాలు.. #Pothole #Malappuram #Kerala pic.twitter.com/73dcjs1hcB
— BBC News Telugu (@bbcnewstelugu) August 10, 2022
#WATCH | Kerala: A man in Malappuram protested against potholes on roads in a unique way by bathing & performing yoga in a water-logged pothole in front of MLA on the way pic.twitter.com/XSOCPrwD5f
— ANI (@ANI) August 9, 2022