సాధారణంగా ప్రజాప్రతినిధుల పిల్లలు రాజకీయల గురించి ఆలోచిస్తుంటారు. తండ్రి.. వారసత్వ రాజకీయలను అందిపుచ్చుకునేందుకు అనేక ఆలోచనలు చేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం అందరికి భిన్నంగా వ్యవహరించాడు. సొంతంగా విమానం తయారు చేసి.. అదే విమానంలో కుటుంబంతో కలసి యూరప్ టూర్ వెళ్లాడు. ప్రస్తుతం ఈ మాజీ ఎమ్మెల్యే కుమారుడు విమానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కేరళలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వి.తామరక్షన్. ఆయన కుమారుడు అశోక్ అలిసెరిల్ తామరక్షన్. ఇతడు పాలక్కాడ్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజి నుంచి బీటెక్ చదివాడు. అనంతరం మాస్టర్ డిగ్రీ కోసం మాస్టర్స్ డిగ్రీ కోసం 2006లో బ్రిటన్ వెళ్లాడు. ఆపై పెళ్లి చేసుకుని ఫోర్డ్ మోటార్ కంపెనీలో మంచి ఉద్యోగంతో చేస్తూ లండన్ లోనే స్థిరపడ్డాడు. ఈక్రమంలోనే 2018లో పైలెట్ లైసెన్స్ కూడా పొందాడు. కరోనా సంక్షోభం అతడిని విమానం తయారు చేసేందుకు పునాది వేసింది. ఆ సమయంలో అశోక్ రెండు సీట్ల చిన్న విమానాన్ని అద్దెకు తీసుకుని సరదాగా విహరించే వాడు. ఈక్రమంలోనే అతని సొంతగా విమానం తయారు చేయాలనే ఆలోచన కలిగింది. ప్రస్తుతం అశోక్, తన భార్య, ఇద్దరు కుమార్తెలతో ఉంటున్నాడు. వీరితో టూర్ తీసుకెళ్లాలంటే 4 సీట్ల విమానం తయారు చేయాలని భావించాడు.
ఈక్రమంలో దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ కు చెందిన స్లింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనే కంపెనీ స్లింగ్ టీఎస్ఐ పేరిట విమాన తయారీ కిట్ ను విక్రయిస్తోందని తెలిసి అక్కడికి వెళ్లి పరిశీలించాడు. అవి నచ్చడంతో వాటిని కొనుగోలు చేసి.. తిరిగి లండన్ వచ్చి తన నివాసంలోనే వర్క్ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. అశోక్ విమానం తయారు చేస్తుండా బ్రిటన్ ఎయిఫోర్స్ అధికారులు పలుమార్లు తనిఖీలు చేశారు. చివరికి సొంతగా విమానం తయారీని పూర్తి చేశాడు. ఇటీవలే ఫిబ్రవరిలో తన చేతులమీదుగా రూపుదిద్దుకున్న ఈ నాలుగు సీట్ల విమానంలో అశోక్ గగనవిహారం చేసి మురిసిపోయాడు. ఈ విమానం తయారీకి అతడికి 18 నెలలు పట్టింది. ఈ విమానం తయారీకి అతడికి రూ.1.8 కోట్లు ఖర్చు అయింది. ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఈ విమానంలో ఇంధన ట్యాంకు సామర్థ్యం 180 లీటర్లు.
కాగా, ఈ చిన్న విమానంలో అశోక్ తన కుటుంబంతో కలిసి యూరప్ వ్యాప్తంగా అనేక పర్యాటక స్థలాలను సందర్శించాడు. తన కుమార్తె పేరిట జి-దియా అని ఆ ప్లేన్ కు నామకరణం చేశాడు. పశ్చమ దేశాల్లో ఇలా ఇంట్లోనే విమానాలు తయారుచేసుకునేదు అనుమతి ఉంటుంది. భారత్ లో కూడా ఇలాగే అనుమతులు లభిస్తే బాగుంటుందని అశోక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అశోక్ తన భార్య అభిలాష, కుమార్తెలు తార, దియాలతో కలిసి స్వస్థలం అలప్పుళ వచ్చారు. మరి.. ఈ మాజీ ఎమ్మెల్యే కొడుకు సొంతంగా విమానం తయారు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.