మనిషి ఎంత కాలం బతుకుతాడో ఎవరు చెప్పలేం. అప్పటి వరకు ఎంతో సంతోషంగా తన వారితో గడిపిన వ్యక్తి మరుసటి నిమిషయంలో మృతి చెందవచ్చు. నిద్ర పోయిన వ్యక్తి.. శాశ్వత నిద్రలోకి జారుకోవచ్చు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
వారిది అన్యోన్య దాంపత్యం. ఎలాంటి సమ్యలు, కలతలు లేని కాపురం. ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రతి విషయంలో తోడు నీడగా ఉండే భార్య.. రత్నాల్లాంటి బిడ్డలు.. వారందరిని చూసుకోవడానికి తల్లిదండ్రులు కూడా వారితో పాటే ఉంటున్నారు. వీరి కుటుంబానికి ప్రత్యేకంగా వ్యాపారం కూడా ఉంది. భార్యాభర్తలిద్దరూ వ్యాపార పనులు చూసుకుంటూ.. ఉంటారు. అయితే ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలను చూసి విధికి కన్ను కుట్టింది. అందుకే నిద్ర పోతున్న వారిని.. నిద్రపోతున్నట్లే తనతో తీసుకెళ్లింది. ఆఖరిదశలో తమను చూసుకుంటారనుకున్న కొడుకు, కోడలు కన్ను మూయడం విషాదమైతే.. తల్లిదండ్రులను కోల్పోయి.. అనాధలుగా మారిన మనవళ్ల బాగోగుల చూడాల్సి రావడం ఆ వృద్ధ జంటను మరింత కుంగదీసింది. వారి బాధ గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. మరి ఇంతకు ఏం జరిగింది.. ఆ దంపతులు ఎలా మృతి చెందారు అంటే..
షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి.. అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దంపతులు సజీవ దహనం అయ్యారు. ఈ విషాదకర సంఘటన కర్ణాటక, యాద్గిరిలో చోటుచేసుకుంది. జిల్లాలోని గుర్మత్ కల్ సమీపంలోని సైదాపూర్‌లో రాఘవేంద్ర, అతడి భార్య శిల్ప నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలో వీరు బట్టల వ్యాపారం చేస్తుండేవారు. వీరికి మూడంతస్తుల భవనం ఉంది. కింది రెండు ఫ్లోర్‌లలో బట్టల షాప్ నడుపుతుండగా.. పైన మూడో అంతస్తులో రాఘవేంద్ర తన తల్లిదండ్రులు, భార్యాబిడ్డలతో కలిసి నివసించేవాడు. ఆదివారం రాత్రి షాప్ క్లోజ్ చేసి భోజనాలు చేసి అందరూ నిద్ర పోయారు.
తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో.. రాఘవేంద్ర నివసిస్తున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కింది ఫ్లోర్‌లో ఉన్న బట్టల షాప్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఆ తర్వాత మంటలు మూడో అంతస్తులోకి వ్యాపించాయి. రాఘవేంద్ర తల్లిదండ్రులను, బిడ్డలను సురక్షితంగా బయటకు పంపగలిగాడు. కానీ వారు బయటకు వద్దామనుకులోపే దట్టమైన పొగ వ్యాపించడంతో.. బయటకు రాలేక.. బిల్డింగ్‌లోనే చిక్కుకుని సజీవ దహనం అయ్యారు రాఘవేంద్ర-శిల్ప దంపతులు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కొడుకును కోల్పోయి ముసలివాళ్లు.. ఇటు తల్లిదండ్రులను కోల్పోయి.. చిన్నారుల అనాధలు అయ్యారంటూ చుట్టుపక్కల వాళ్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.