బస్సులో ఆకతాయి వెకిలి చేష్టలు.. చావగొట్టిన యువతి!

ఆ వ్యక్తి యువతితో తప్పుగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. యువతి మొదట అతడ్ని హెచ్చరించింది. అయితే, అతడు తన పద్దతి మార్చుకోలేదు. దీంతో ఆమె అపరకాళిలా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 12:58 PM IST

ఈ మధ్యకాలంలో ఆడవాళ్లపై ఆకతాయిల ఆగడాలు ఎక్కువయిపోయాయి. ఒంటరిగా వెళుతున్న వారిపైనే కాదు.. నలుగురి మధ్యలో ఉన్నపుడు కూడా కొంతమంది ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే, తమతో తప్పుగా ప్రవర్తించిన వారికి తగిన విధంగా బుద్ధి చెబుతున్నారు కొందరు ధైర్యవంతురాల్లైన ఆడవాళ్లు. తాజాగా, ఓ యువతి తనతో తప్పుగా  ప్రవర్తించిన వ్యక్తిని చావగొట్టింది. బస్సులో అతడిపై విరుచుకుపడింది.

ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మండ్యా జిల్లాకు ఓ యువతి బస్సులో ప్రయాణిస్తూ ఉంది. బస్సులో ఆమెతో పాటు చాలా మంది ఉన్నారు. బస్సు కేఆర్‌ పేట బస్‌ స్టాప్‌ దగ్గరకు రాగానే ఓ వ్యక్తి ఆమెతో తప్పుగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. ఆమెను తాకటం మొదలుపెట్టాడు. దీంతో యువతికి కోపం వచ్చింది. అలా చేయవద్దని ఆమె అతడ్ని ఓ సారి హెచ్చరించింది. అయినా.. అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అతడిపై విరుచుకుపడింది. అందరి ముందు అతడ్ని చావకొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అమ్మాయిలంటే ఈ విధంగా ఉండాలి. ఈమె అందరు అమ్మాయిలకు స్పూర్తి’’.. ‘‘ ఈ మధ్య కాలంలో మగాళ్లు బాగా రెచ్చిపోతున్నారు’’..‘‘ అమ్మాయి కాదు.. ఆదిపరాశక్తి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed