SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Karnataka Police Check Cm Basavaraj Bommai Car Video Goes Viral

నడి రోడ్డుపై CM కారు ఆపిన పోలీసులు.. మద్యం, డబ్బు కోసం సోదాలు!

సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీల కార్లు, కాన్వాయ్‌లు రోడ్ల మీదకు వస్తే.. పోలీసులు తనిఖీలు చేయకుండా పంపిచేస్తారు. అవసరమైతే ట్రాఫిక్‌ కూడా ఆపుతారు. కానీ ఓ చోట మాత్రం అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా సీఎం కారునే తని​ఖీ చేశారు. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Sat - 1 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నడి రోడ్డుపై CM కారు ఆపిన పోలీసులు.. మద్యం, డబ్బు కోసం సోదాలు!

సీఎం కాన్వాయ్‌ రోడ్డు మీదకు వచ్చిందటే.. ట్రాఫిక్‌ను ఆపి మరి.. కాన్వాయ్‌ వెళ్లడానికి మార్గం సుగమం చేస్తారు. ప్రజలు ఇబ్బంది పడ్డా పట్టించుకోరు. సీఎం దాకా ఎందుకు.. ఎమ్మెల్యేలు, మినిస్టర్ల వాహనాలు రోడ్ల మీదకు వచ్చినా సరే.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు పంపుతారు. వీఐపీల వాహనాలకు సంబంధించి పోలీసుల తీరు ఇలానే ఉంటుంది. ప్రాంతంతో సంబంధం లేకుండా.. ఎక్కడైనా ఇదే పద్దతి అనుసరిస్తారు. ఇక వారి వాహనాల్లో తనిఖీలు చేయడం అనేది దాదాపు అసాధ్యం. కానీ ఓ చోట మాత్రం పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపి సోదాలు నిర్వహించారు. సీఎం కారులో మందు, డబ్బులు తరలిస్తున్నారేమో అని జాగ్రత్తగా పరిశీలించారు. ఆ వివరాలు..

ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రాష్ట్ర పోలీసులు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వాహనాన్నే తనిఖీ చేశారు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది. మరి కొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి.. అన్ని వాహనాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ అధ్వర్యంలో బెంగళూరు రూరల్​ జిల్లా దొడ్డబల్లాపుర్ ప్రాంతంలోని హోసహుద్య సమీపంలో చెక్ పోస్ట్ వద్ద ఈ తనీఖీలు జరిగాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వాహనశ్రేణి అదే మార్గంలో వస్తోంది. దాంతో మిగతా వాహనదారుల మాదిరిగానే.. ముఖ్యమంత్రి కాన్వాయ్​ను ఆపారు పోలీసులు. అనంతరం ఆ వాహనాలు అన్నింటినీ తనిఖీ చేశారు.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయానికి దర్శనం కోసం వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు చేసిన ఈ పనిపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస‍్పీ మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. ‘‘త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అక్రమ నగదు, మద్యం రవాణా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీటిని నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మొత్తం ఆరు చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేశాం. అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వాహనాన్ని కూడా తనిఖీ చేశాం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు’’ అని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన మేరకు.. కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ఏప్రిల్​ 13న నోటిఫికేషన్​ వెలువడుతుంది. మే 10న పోలింగ్​ జరుగుతుంది. అదే నెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మరి పోలీసులు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Assembly ElectionS
  • Basavaraj Bommai
  • Karnataka
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్టు లిస్టు విడుదల.. ఆ స్థానాల్లో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్టు లిస్టు విడుదల.. ఆ స్థానాల్లో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

  • వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

    వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam