Karnataka: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. మంత్రి రూపంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మరో తల నొప్పి తయారైంది. ప్రభుత్వంపై కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఆయనకి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో సదరు మంత్రి మాట్లాడుతూ.. ‘‘ మేము ప్రభుత్వాన్ని నడపటం లేదు. మేనేజ్ చేస్తున్నాం అంతే’’ అని అన్నారు. అధిష్టానం బొమ్మైని పదవినుంచి తప్పిస్తుందనే వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు నిప్పురాజేశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు. ‘‘ అంతా బాగానే ఉంది. ఎలాంటి సమస్యా లేదు. నేను అందరితోనూ మాట్లాడతాను. సమస్యను పరిష్కరిస్తాను’’ అని పేర్కొన్నారు.
జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలపై మరో మంత్రి మునిరత్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ మేము ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నామని అతడు అనుకుంటున్నట్లయితే.. న్యాయ శాఖ మంత్రి పదవినుంచి అతడు ఇప్పుడే దిగి పొమ్మనండి. అతడు ప్రభుత్వంలో ఓ భాగం. అన్ని క్యాబినేట్ సమావేశాల్లోనూ.. తీసుకునే నిర్ణయాల్లోనూ అతడు భాగం. అతడలా అన్నాడంటే.. ఇందుకు అతడు కూడా కారణమే. మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అంటే బాధ్యతలేని తమనే’’ అని అన్నారు. మరి, మంత్రి ఆడియో లీక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : సామాన్యులకు షాక్! భారీగా పెరగనున్న పాల ధరలు!