ఆ మద్య రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రధానికి అన్నదాతలు రక్తంతో లేఖలు రాసిన విషయం సంచలనం రేకెత్తించింది. కేవలం అన్నదాతలు మాత్రమే కాదు.. మరికొంత మంది తమ కష్టాలు అధికార పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం అవుతూ.. రక్తంతో లేఖలు రాసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో ఎంతో మందికి అన్యాయం జరిగిందని.. తాము అర్హత ఉన్నా కొంతమంది అక్రమార్కుల వల్ల నష్టపోయామని ప్రధాని మోదీకి బాధిత అభ్యర్థులు ఏకంగా రక్తంతో లేఖ రాశారు. అంతేకాదు దీనిపై సరైన విచారణ జరిపించి నింధితులకు కఠిన శిక్ష విధించాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
లంచాలు తీసుకొని అక్రమార్కులు అనర్హులకు కేటాయించారని.. ఉద్యోగం వస్తుందని తాము ఎంతో కష్టపడి పరీక్షలు రాసి పాసయ్యామని.. కానీ నియామకాల్లో మాత్రం అక్రమాలు జరిగాయని.. తాము అర్హత సాధించినా.. అనర్హులుగా వేటు వేశారని.. ఇక్కడ డబ్బులు ఉన్నవారికే ఉద్యోగాలు అన్న రీతిలో సాగుతుందని అభ్యర్థులు లేఖలో పేర్కొన్నారు. తమకు సరైన న్యాయం చేయాలని.. లేదంటే ఉద్యమంలో చేరుతామని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sri Reddy: కరాటే కళ్యాణిని బూతులు తిడుతూ శ్రీరెడ్డి పోస్ట్.. వీడియో వైరల్!