పిల్లలకు కూడా మొట్టమొదటి హీరో తండ్రే. తల్లి పిల్లల కోసం పడుతున్న తపన కనబడుతుంది కానీ..తండ్రి పడుతున్న కష్టం కనిపించదు. ఎక్కువగా అమ్మ లాలనలో పెరుగుతూ.. తండ్రి కోపాన్ని, గుంభన మనస్థత్వాన్ని చూసి కొంత దూరంగా మసలుతుంటారు.. చిన్నప్పడు తెలియదు నాన్న కష్టం. వారు పెరిగి పెద్దయ్యాక.. వారు ఓ బిడ్డలకు తల్లిదండ్రులయ్యాక తెలుస్తుంది
తల్లి నవమోసాలు మోసి కన్నప్పటికీ.. నాన్న పిల్లల బాధ్యతలు కడ వరకు మోస్తూనే ఉంటాడు. పిల్లలకు మొట్టమొదటి హీరో తండ్రే. తల్లి పిల్లల కోసం పడుతున్న తపన కనబడుతుంది కానీ..తండ్రి పడుతున్న కష్టం కనిపించదు. ఎక్కువగా అమ్మ లాలనలో పెరుగుతూ.. తండ్రి కోపాన్ని, గుంభన మనస్థత్వాన్ని చూసి కొంత దూరంగా మసలుతుంటారు. కానీ పిల్లలకు తండ్రి అంటే అమితమైన గౌరవం. ఎప్పుడైతే పిల్లలు అభివృద్ధిలో పయనిస్తారో.. అప్పుడు తండ్రి వ్యక్తపరచలేనంత ఆనందంతో పొంగిపోర్లుతుంటాడు. చిన్నప్పడు తెలియదు నాన్న కష్టం. వారు పెరిగి పెద్దయ్యాక.. వారు ఓ బిడ్డలకు తల్లిదండ్రులయ్యాక తెలుస్తుంది. కానీ అప్పటికే నాన్న కనిపించని దూరంలో ఉంటాడు. అయితే అతడికి నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. పుట్టక ముందే చనిపోయిన తన తండ్రి ఆశయం కోసం ఓ బిడ్డ ఏం చేశాడంటే.?
తాను పుట్టకముందే తండ్రి మరణించాడు. కానీ అతడి ఆశయాన్ని నిలబెట్టేందుకు కుమారుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో సీటును వదులుకుని సైన్యంలో చేరుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుల్గావ్‌కు చెందిన లాన్స్ నాయక్ కృష్ణజీ సమ్రిత్ 1999లో కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. అప్పటికే అతడికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆయన భార్య సవిత నిండు శూలాలు. అతడు చనిపో్యిన 45 రోజుల తర్వాత ప్రజ్వల్ (23) పుట్టాడు. అతడు కళ్లు తెరవకముందే తండ్రి మరణించాడు. అయితే తన పిల్లల్లో ఒకరిని ఆర్మీలో చేర్చాలని ఆయన కల. అదీ ప్రతి ఒక్కరి కలగా మారింది. అన్న కునాల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకోవడంతో ప్రజ్వల్ తండ్రి కలను నెరవేర్చడం తన బాధ్యతగా భావించాడు. అయితే, ఈ లక్ష్యాన్ని ప్రజ్వల్ అంత సులభంగా చేరుకోలేదు. తొమ్మిది సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలను దాటుకుని అనుకున్నది సాధించాడు.
తండ్రి కోరిక కోసం ఐఐఎంలో సీటును కాదనుకున్నాడు. చివరకు అనుకున్నదీ సాధించాడు. ప్రజ్వల్ జూన్ మొదటి వారంలో డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఎ)లో జెంటిల్‌మెన్ క్యాడెట్‌గా చేరబోతున్నాడు. ప్రజ్వల్ మాట్లాడుతూ… ‘ఇది నా చివరి ప్రయత్నం కాబట్టి నేను బలమైన బ్యాకప్ ప్లాన్‌ని సిద్ధం చేయాల్సి వచ్చింది.. నేను కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)లో విజయం సాధించాను.. ఈ నెలలో ఐఐఎం ఇండోర్, కోజికోడ్‌ల నుంచి ఆఫర్లు వచ్చాయి’ చెప్పారు. కార్గిల్ యుద్ధంలో భర్తను కోల్పోయినప్పటికీ తన కొడుకులలో ఒకరితో ఆయన కలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాను అని తల్లి సవిత చెప్పారు. తన పెద్ద కొడుకును ఆర్మీ ఆఫీసర్‌గా చూడాలని ఆయన కోరుకున్నానని, అయితే అతడు వేరే మార్గాన్ని ఎన్నుకోవడంతో.. ప్రజ్వల్ తన ఆశయాన్ని నెరవేర్చుతాడని అనుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు చాలా గర్వంగా ఉందని తెలిపారు.