సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అంటారు. అంతటి మహత్తు ఉంది. ఇప్పటికే ఈ సంగీతంలో అనేక మంది ప్రముఖులు మనల్ని ఓలలాడించారు.. ఇంకా మనల్ని ఆ రాగాల ధ్వనిలో మంత్ర ముగ్థులను చేస్తున్నారు. అటువంటి ప్రముఖుల్లో ఒకరైన ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు
మనిషికి ఎన్ని బాధలున్నా సంగీతంతో జయించవచ్చు. ఏ సంగీత వాయిద్యమైన చక్కటి సంగీతం అందిస్తుంటే.. వీనుల విందుగా అనిపిస్తుంది. మనస్సంతా తేలికగా మారిపోతుంది. మన ఆలోచనలను, భావాలను ప్రభావితం చేయగల శక్తి సంగీతానికి ఉంది. అందుకే సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అంటారు. అంతటి మహత్తు ఉంది. ఇప్పటికే ఈ సంగీతంలో అనేక మంది ప్రముఖులు మనల్ని ఓలలాడించారు.. ఇంకా మనల్ని ఆ రాగాల ధ్వనిలో మంత్ర ముగ్థులను చేస్తున్నారు. అటువంటి ప్రముఖుల్లో ఒకరైన మృదంగ విద్వాంసుడు కారైకుడి ఆర్ మణి ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయారు.
ప్రముఖ మృదంగ విద్వాన్ కారైకుడి ఆర్ మణి కన్నుమూశారు. అర శతాబ్దానికి పైగా కర్ణాటక సంగీత ప్రపంచాన్ని శాసించిన ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. మృదంగ వాయనంలో ప్రఖ్యాతి గడించిన ఆయన.. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 3 సంవత్సరాల వయస్సులో కర్ణాటక సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన మణి ఎన్నో గౌరవ పురాస్కారాలను పొందారు. ఆయన దేశ సాంస్కృతిక రాయబారిగా నిలిచారు. రంగు అయ్యంగార్, డిఆర్ హరిహర శర్మ , కెఎమ్ వైద్యనాథన్‌ల శిష్యుడు. మణి 1963లో కేవలం 18 సంవత్సరాల వయస్సులో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ నుండి తన తొలిసారి జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. 1998లో ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నారు.
ఎన్నో ప్రపంచ వేదికపైకి ఆయన మృదాంగ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ సంగీత విద్యాంసులు ఎమ్ఎస్. సుబ్బులక్ష్మితో సహా అనేక మంది కర్ణాటక సంగీత ప్రముఖుల కోసం మృదంగం వాయించాడు. డి.కె. పట్టమ్మాళ్, ఎం.ఎల్. వసంతకుమారి, మధుర సోము, టి.ఎం. త్యాగరాజన్, డి.కె. జయరామన్, లాల్గుడి జయరామన్, సంజయ్ సుబ్రమణియన్, టి.ఎం. అతను కృష్ణ మరియు ఇతరులకు కూడా మృదంగం వాయించాడు. అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. శృతిలయ పెర్కషన్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆయనే. అలాగే. శృతి లయ సేవా ట్రస్ట్ పేరిట ఎన్నో సేవ కార్యక్రమాలను చేశారు. అలాగే.. ‘శ్రుతి లయ కేంద్రం’ అనే సంగీత పాఠశాలను ప్రారంభించి ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో కర్ణాటక సంగీతాన్ని బోధిస్తూ వస్తున్నారు.