కర్ణాటక రాష్ట్రం మొత్తం జేమ్స్ ఫీవర్ నడుస్తోంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా కావడంతో థియేటర్లలో అభిమానులు పోటెత్తారు. ఈ వారం మొత్తం కర్ణాటకలో జేమ్స్ సినిమానే ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదల రోజు నుంచి సంబరాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ సంబరాల్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పునీత్ అభిమాని ఒకరు సంబరాల్లో గుండెపోటుతో మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి: అప్పు చివరి చిత్రం ‘జేమ్స్’ చూడలేనంటూ పునీత్ భార్య అశ్విని భావోద్వేగం
వివరాల్లోకి వెళ్తే.. మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హెడియాల గ్రామంలో గురువారం పెద్దఎత్తున సంబరాలు చేశారు. ఆ సంబరాల్లో హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షులు మంజులా కుమారుడు ఆకాశ్(22) పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆకాశ్ గుండెపోటుతో మరణించాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఆకాశ్ గుండెపోటుతో మరణించడం తల్లిదండ్రులనే కాదు.. ఆ గ్రామం మొత్తాన్ని కలచివేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.