యోగా ఎంత మహత్తరమైనదో స్వీయానుభావంతో తెలిసొచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా తన సోదరికి జరిగిన ప్రమాదం గురించి, అందులో నుంచి ఆమె ఎలా బయటపడిందో నెటిజనులతో పంచుకున్నారు. కంగనా రనౌత్-రంగోలీ చందేల్ – వీరిద్దరిదీ అక్కచెల్లెళ్లకు మించిన అందమైన అనుబంధం. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తన అక్క రంగోలీపై ఆమ్లదాడి జరిగిన సమయంలోనూ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ ధైర్యం నింపిన సంగతి ఇప్పటికే పలు సందర్భాల్లో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే రంగోలీ ఆ దాడి నుంచి పూర్తిగా కోలుకోవడానికి యోగా ఎంతగానో సహకరించిందంటూ తాజాగా కంగన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
అక్క రంగోలికి 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఓ వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. అక్క తిరస్కరించడంతో అతడు ఆమెపై ఆగ్రహంతో యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే అక్కకు వైమానిక దళ అధికారితో నిశ్చితార్థం జరిగింది. కానీ యాసిడ్ దాడి జరిగిన తరువాత అతడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేశాడు. కనీసం అక్కని చూడడానికి కూడా రాలేదు. యాసిడ్ దాడి కారణంగా ఆమెకు ఒక కంటిలో దృష్టిని కోల్పోయింది. చెవి కాలిపోయింది. చెస్ట్ తీవ్రంగా దెబ్బతింది. మూడు సంవత్సరాల్లో ఆమెకు 53 ఆపరేషన్లు చేయవలసి వచ్చింది. ఆ సమయంలో అక్క ఎవరితో మాట్లాడేది కాదు. మానసికంగా చాలా కృంగి పోయింది. షాక్‌లో ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నేను యోగాకి వెళుతూ అక్కని కూడా తీసుకువెళ్లేదాన్ని.
యోగాను జీవనశైలిలో భాగం చేసుకొని తన తల్లిదండ్రులు కూడా పలు ఆరోగ్య సమస్యల్ని జయించారని చెబుతోంది. రంగోలీ యోగా కథ చాలామందికి స్ఫూర్తిదాయకం అంటోంది కంగన. అక్క రంగోలి జీవితంలో జరిగిన విషాద సంఘటనను యోగా డే నాడు గుర్తు చేసుకుంది కంగనా రనౌత్. మానసికంగా , శారీరకంగా కోలుకోవడానికి యోగా సహాయపడుతుందని వివరించింది. యోగాను జీవనశైలిలో భాగం చేసుకొని తన తల్లిదండ్రులు కూడా పలు ఆరోగ్య సమస్యల్ని జయించారని చెబుతోంది.
Kangana has written this sweet message for her buaji on her birthday by sharing buaji’s pic with rangoli di #KanganaRanaut pic.twitter.com/31LilzSpms
— KRInstaupdate (@KR_Insta) June 19, 2021