మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ హిట్ తో ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా మొదలైంది. ప్రముఖ కథానాయకుల, రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు నిర్మిస్తున్నారు. అలనాటి అందాల నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘తలైవి’ గా పేరు పెట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తోంది. విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫైర్ బ్రాండ్ అచ్చం జయలలిత మాధిరిగానే కనిపిస్తోంది. టీజర్ ట్రైలర్ లోనూ కంగనా రనౌత్ జయలలిత లుక్ లో అదరగొట్టింది. ఇక తాజాగా మరోసారి కంగనా రనౌత్ జయలలిత గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే ఈ సారి కంగనా సినిమా షూటింగ్ కోసం జయలలిత గెటప్ ధరించలేదు.
తలైవి సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఈనెల 10వ తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసందే. దాంతో ఈ సినిమా విజయం సాధించాలని జయలలిత గెటప్ లో చెన్నై లోని మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధి వద్దకు వెళ్లి కంగనా రనౌత్ నివాళ్లర్పించింది. ఇక ప్రస్తుతం జయలలిత గెటప్ లో కంగనా కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అరవిందస్వామి ఇందులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
Tamil Nadu: Actor Kangana Ranaut pays tribute at former Chief Minister J Jayalalithaa’s memorial at Marina Beach in Chennai, ahead of the release of her film ‘Thalaivii’, that is based on the former CM. pic.twitter.com/Wb1puvjpgU
— ANI (@ANI) September 4, 2021