ఏ మనిషి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అధికారం ఉంది కదా అని అహంకారం ప్రదర్శించకూడదు. గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వారే అణిగిమణిగి ఉంటున్నారు. తమ దగ్గర అసిస్టెంట్లు ఉన్నా కూడా వ్యక్తిగత పనులు చెప్పరు. కానీ ఓ కలెక్టర్ మాత్రం తన అసిస్టెంట్ తో బూట్లు మోయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంప్లాయ్, బాస్.. పేరుకే హోదాలో తేడా ఉంటుంది గానీ వ్యక్తిత్వంగా ఇద్దరి మధ్య ఎటువంటి బేధాలు ఉండవు. ఉండకూడదు. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటేనే సంస్థ అనేది బాగుంటుంది. బాస్ కూడా ఒక ఉద్యోగే. తోటి ఉద్యోగులను గౌరవిస్తేనే ఉద్యోగులు బాస్ ని గౌరవిస్తారు. రాజకీయ నాయకులైనా సరే, ప్రభుత్వ అధికారులైనా సరే తమ కింది వారికి గౌరవం ఇస్తేనే మర్యాద నిలబడుతుంది. లేదంటే సోషల్ మీడియాలో ఒక దోషిగా నిలబెడుతుంది. ఒక కలెక్టర్ తన కింది స్థాయి ఉద్యోగితో బూట్లు మోయించాడు. అసలు పై అధికారి, కింది ఉద్యోగులతో కేవలం వృత్తిపరమైన పనులే చేయించుకోవాలి. కానీ ఇలా బూట్లు, చెప్పులు మోయించడం, బట్టలు ఉతికించుకోవడం లాంటివి చేయించకూడదు.
అలాంటిది కలెక్టర్ అయి ఉండి ఈ మాత్రం తెలియకపోతే ఎలా అని మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే? తమిళనాడులోని కళ్లకురుచి జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ జతవత్ వివాదంలో ఇరుక్కున్నారు. కూవగం అనే పండుగను ట్రాన్స్ జెండర్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ క్రమంలో కూవగం అనే గ్రామంలోని ఓ ఆలయంలో ఈ వేడుకను జరుపుకున్నారు. ఆ వేడుకకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా ఓ ఆలయాన్ని బుధవారం సందర్శించారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో తన కాళ్లకున్న బూట్లు తీశారు. తన అసిస్టెంట్ ని పిలిచి ఆ బూట్లు మోయవలసిందిగా కలెక్టర్ చెప్పడం, ఆ బూట్లను ఆ సిబ్బంది మోసుకుని వెళ్లడం వీడియోలో రికార్డ్ అయ్యింది.
ఈ ఘటనపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి వ్యక్తులకు ఇదేనా మీరిచ్చే మర్యాద? ఇదేనా సామాజిక న్యాయం? అంటూ మండిపడుతున్నారు. మీ బూట్లు మోయడానికి ఉన్నారా ఉద్యోగులు. అంత వయసున్న పెద్ద మనుషులతో బూట్లు ఎలా మోయమని చెప్పారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం మీద కలెక్టర్ స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. తన అసిస్టెంట్ కి బూట్లు తీసుకెళ్లమని తాను సూచించలేదని అన్నారు. ఆ వీడియోను ఎవరో కట్ చేసి ఎడిట్ చేసి తప్పుగా అన్వయించారని అన్నారు. అయితే నెటిజన్స్ మాత్రం కలెక్టర్ ను తప్పుబడుతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Shocking video of Kallakurichi District Collector #SravanKJatavat ordering his Duffedar to pick up his shoes after he removed them to enter the temple.
It is said that he was inspecting the Koovagam Koothandavar temple ahead of the Chithirai festival.
Social justice?? #DMK pic.twitter.com/LQuYNl2yFe
— Varshini Ramu (@VarshiniRamu) April 12, 2023