దేశంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వస్తున్నారు. లాటెంల్, అదృష్టం కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదామ్ సాంగ్ ఊపు ఊపేసింది. దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఈ పాట ఉర్రూతలూగిస్తుంది.. డ్యాన్స్ చేయిస్తుంది. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే పాటగా మలిచి క్రేజీనెస్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పల్లీల వ్యాపారి జీవితమే మారిపోయింది. దేశవ్యాప్తంగా కచ్చా బాదమ్ పాటకు రీల్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో అయితే రీల్స్ విపరీతంగా చేస్తున్నారు.
ఈ పాటను డిజే చేస్తే దానికి కూడా 50 మిలియన్ వ్యూస్‌కు పైగానే వచ్చాయి. ఒక్క పాటతో పల్లీల వ్యాపారి జీవితమే మారిపోయింది. తాజాగా ఈ వైరల్ సింగర్‌కు ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో భూబన్ ఛాతిలో బలమైన గాయం అయింది. దీంతో భూబన్ ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. భూబన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కాగా, భూబన్ కు స్టార్ డమ్ రావడంతో సెకండ్ హాండ్ లో ఒక కారు తీసుకున్నాడు. అయితే భూబన్ కు డ్రైవింగ్ రాకపోవడం నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో భూబన్ కారు నడుపుతుండగా ప్రమాదం జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే తన సొంతగా ఓ పాట అల్లుకొని విధుల్లో పాడుతూ తన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఆ పాట ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్‌స్టా రీల్స్‌తో కచ్చా బాదామ్ ఫేమస్ అయ్యింది.