Kacha Badam Fame Bhuban Badyakar: ‘‘కచ్చా బాదామ్’’ పాట దేశ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిన విషయమే. ఆ పాట పాడిన భుబన్ బాద్యకర్ రాత్రికి రాత్రి ఓ సెలెబ్రిటీ అయిపోయాడు. లక్షలు వచ్చిపడ్డాయి. ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని ప్రమాదానికి కూడా గురయ్యాడు. ఆసుపత్రి పాలైన ఆయన తాజాగా కోలుకున్నాడు. ఓ పాట రికార్డింగ్ కోసం ముంబై వచ్చిన ఆయన చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇప్పటికీ నేను గ్రామ గ్రామాలకు తిరిగి ఓ సాధారణ పల్లీలు అమ్ముకునే వ్యక్తిని మాత్రమే. హఠాత్తుగా వచ్చి పడ్డ డబ్బు నన్ను మార్చేసింది. నా కలను నెరవేర్చుకోవటానికి సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను. అది నేను కాదని తర్వాత తెలుసుకున్నాను. కారు ప్రమాదంతో నా కళ్లు తెరుచుకున్నాయి. నాకు కారు అవసరం లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఒకానొక దశలో ఇక పల్లీలు అమ్మాల్సిన అవసరం లేదు అనుకున్నాను.
కానీ, అవసరం అయితే, మళ్లీ పల్లీలు అమ్మటానికి రెడీ. నేను ఇకపై ఎప్పుడు ఒదిగి ఉండాలని డిసైడ్ అయ్యా. నేను కారు నడపను. తాజాగా, ఓ రెండు పాటలు రాశాను. వాటి రికార్డింగ్ కూడా అయిపోయింది. మొదటి పాట ‘ సారెగమ’’ రెండవ పాట ‘‘ అమర్ నోటున్ గారి’’. రెండవ పాటతో జీవితంపై నా భావాలను ప్రజలు తెలుసుకుంటారు’’ అన్నాడు. కేరళ, బంగ్లాదేశ్‌నుంచి షోలు చేయాలంటూ పిలుపు వస్తున్నాయని తెలిపాడు. అక్కడి నుంచే కాదు.. దుబాయ్‌నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయంట. కానీ, పాస్‌పోర్టు లేకపోవటం, విదేశాలకు వెళ్లటం తన భార్యకు ఇష్టం లేకపోవటం వల్ల ఆగిపోతున్నాడంట. భుబన్ బాద్యకర్ పరివర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వైరల్ వీడియో: పోలీస్‌ను గాల్లోకి ఎత్తి కొట్టిన ఎద్దు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి