Police Singam Surya Style Moustache: తమిళ స్టార్ హీరో సూర్య పోలీస్‌గా నటించిన సినిమాల్లో ‘సింగం’కు సూపర్ క్రేజ్ ఉంది. ఆ సినిమాలో సూర్య మీసం స్టైల్ సాధారణ ప్రజలనుంచి పెద్దపెద్ద పోలీసు ఆఫీసర్ల వరకు అందరినీ ఆకర్షించింది. చాలా మంది అలా మీసం కట్టును ఫాలో అయ్యారు.. అవుతున్నారు కూడా. తాజాగా, ఓ కానిస్టేబుల్ ‘సింగం’ సూర్య స్టైల్ మీసాలను చేయించుకుని కోర్డు, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
రాజేష్ కన్నన్.. తమిళనాడు, నీలగిరి జిల్లాలోని అంబులముల పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సింగం సినిమాలో సూర్య మీస కట్టు నచ్చి.. తాను కూడా అలా మీసాలు చేయించుకున్నాడు. ఆ తర్వాత ఓ కేసు పని మీద నీలగిరి జిల్లా కోర్టుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో కోర్టు జడ్జి మురుగన్.. రాజేష్ కన్నన్ మీసాలను చూశాడు. ఆవెంటనే పక్కనే ఉన్న పోలీసు ఉన్నతాధికారితో ‘‘ ఏమయ్యా! ఇతడు ఇలా మీసాలు చేయించుకోవటానికి మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా?’’ అని అడిగాడు.
సదరు పోలీసు ఉన్నతాధికారి లేదని చెప్పాడు. దీంతో జడ్జి రాజేష్‌పై సీరియస్ అయ్యాడు. వెంటనే మీసాలు సరిచేసుకుని రమ్మని ఆదేశించాడు. జడ్జి ఆదేశాలతో ఇక చేసేదేమీ లేక రాజేష్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దగ్గరలోని సెలూన్‌లో మీసాలు సరి చేయించుకుని కోర్టుకు తిరిగివచ్చాడు. జడ్జి ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై సీరియస్ అవ్వటం, మీసాలు సరిచేయించుకోమని హెచ్చరించటంతో కొన్ని గంటల పాటు కోర్టులో కలకలం రేగింది.
దీనిపై ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘ పోలీసులు తమ ఐడీ కార్డులో ఉన్న ఫొటోలో ఎలా ఉంటారో.. అలాగే కనిపించాలి. ఐడీ కార్డులో ఉన్న దానిలా కాకుండా వేరేలా ఉండేటట్లు హేయిర్ స్టైల్స్, మీసం, గడ్డం స్టైల్స్ చేయించుకోవాలనుకున్నా ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకోవాలి’’ అని తెలిపారు. కోర్టులో కలకలం రేపిన పోలీస్ కానిస్టేబుల్ ‘సింగం’ సూర్య మీసాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రూ.100తో లాటరీ టికెట్ కొన్న బాలిక.. జాక్ పాట్ కొట్టేసింది!