టెలికాం సంచలనం రిలయన్స్ జియో.. మొబైల్ వినియోగదారులకు జియో నెక్ట్స్‌తో సర్‌ప్రైజ్ ఇస్తున్న విషయం తెలిసందే. ఇప్పుడు ఆ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లతో ఒక వీడియోని విడుదల చేశారు. ‘ఇన్ ఇండియా, ఫర్ ఇండియన్స్, బై ఇండియన్స్,’ అనే స్లోగన్‌తో ఈ ఫోన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఫోన్‌ను గూగుల్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ ఫోన్ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్(వోఎస్)ను కూడా అభివృద్ధి చేశారు. ఈ ఫోన్ మొత్తం తయారీ ఇండియాలోనే జరుగుతోందంటూ గర్వంగా ప్రకటిస్తున్నారు.
జియో ఫోన్ నెక్ట్స్ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ‘ప్రగతి’ని రూపొందించారు. అతి తక్కువ ఖర్చుతో ప్రతి సామాన్య భారతీయుడు, యువతకు ఇది అందుబాటులోకి రావాలనే లక్ష్యంతోనే ఈ ఓఎస్‌ను తయారు చేసినట్లు సంస్థ అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ ఓఎస్ భారతదేశంలో ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు. అంతేకాకుండా ప్రగతి ఓఎస్ బ్యాటరీని తక్కువ వినియోగించుకోవడం వల్ల.. బ్యాటరీని ఎక్కువ డ్రైయిన్ చేయదని చెబుతున్నారు.
ఏ ప్రాసెసర్ ఉపయోగించారు అనే విషయాన్ని వీడియోలో చెప్పనప్పటికీ.. కాలకమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు లీకులు ద్వారా తెలిసింది.
ఈ ఫోన్‌లో మరో ఆసక్తికర ఫీచర్ పెద్దగా చదవడం. మీరు ఏ యాప్ ఉపయోగిస్తున్నా కూడా ఈ ఫీచర్‌ను వాడవచ్చు. ఆ యాప్‌లో ఉన్న మొత్తం వివరాలను జియో ఫోన్ నెక్ట్స్ చదివి వినిపించగలదు.
జియో ఫోన్‌లో మరో అదిరిపోయో.. ఆకట్టుకుంటున్న ఫీచర్ ట్రాన్స్‌లేషన్. మీరు ఒక భాషలో మాట్లాడితే దానిని ఇంకో భాషలోకి మార్చవచ్చు. అది ఒకటి రెండు కాదు ఏకంగా 12 భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయగలదు. ఏదైన కొత్త ప్రాంతానికి, మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
చాలా తక్కువలో ఈ ఫోన్‌ను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో కెమెరా పెద్దగా క్వాలిటీ ఉండదని అందరూ అనుకున్నారు. కానీ, ఆ వార్తలను తోసిపుచ్చుతూ 13 మెగా పిక్సల్ కెమెరాను ఈ ఫోన్‌లో పొందుపరిచారు.
ఈ ఫోన్‌లో ప్లే స్టోర్ ద్వారా అన్ని రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈ ఫోన్‌ను ఏపీలోని తిరుపతి, తమిళనాడులోని శ్రీపెరంబదూరు ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. పూర్తిగా ఈ ఫోన్ ఇండియాలోనే తయారు అవుతున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ఇది భారతీయ యువత చేతికి అందుతుందని తెలియజేశారు. ఈ ఫోన్ చెప్పిన విధంగా ఈ సంవత్సరం దీపావళికి వినియోగదారులకు అందిస్తామంటున్నారు. నవంబర్ 4న జియో ఫోన్ నెక్ట్స్‌ను మార్కెట్‌లోకి తెస్తామన్నారు.