ఇటీవల వరుసగా రాజకీయ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సాయన్న కన్నుమూశారు. పదవిలో ఉండగానే ప్రాణాలు విడిచారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే తుది శ్వాస విడిచారు.
ఇటీవల వరుసగా రాజకీయ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సాయన్న కన్నుమూశారు. అలాగే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైన టాలీవుడ్ నటుడు తారకతర్న మృతి చెందారు. తాజాగా మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కూడా అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. ఇప్పుడు మరో రాజకీయ నేత, విద్యాశాఖ మంత్రి తుది శ్వాస విడిచారు. జార్ఖండ్ లోని హేమంత్ సోరెన్ మంత్రి వర్గంలో విషాదం నెలకొంది.
గురువారం ఉదయం జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో దా కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘తీరని నష్టం జరిగింది. మన టైగర్ జగర్నాథ్ దా ఇక లేరు. ఈ రోజు జార్ఖండ్.. గొప్ప ఉద్యమకారుడు, పోరాట పటిమ, నిరంతరం శ్రమించే వ్యక్తి, ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరిని కోల్పోయింది. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఈ విపత్కర పరిస్థితిలో కుటుంబసభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని ప్రార్థిస్తున్నా.’ అని సీఎం ట్వీట్ చేశారు.
జగర్నాథ్ జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) పార్టీ తరుపున డుమ్రీ నియోజకవర్గం నుండి పోటీ చేసి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపొందారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి శిభు సోరెన్ నాయకత్వం వహించారు. జగర్నాథ్ 2020లో కోవిడ్ బారిన పడిన తర్వాత ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్నాడు. ఇటీవలి జార్ఖండ్ బడ్జెట్ సెషన్‌లో అతను మరోసారి అస్వస్థతకు గురయ్యారు. అనంతరం చెన్నైకి విమానంలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఎంజీఎం హెల్త్‌కేర్‌కు చెందిన డాక్టర్ అపర్ జిందాల్ తెలిపారు. కాగా, ఏప్రిల్ 6 నుంచి రెండు రోజుల పాటు సంతాప దినాలుగా జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
अपूरणीय क्षति!
हमारे टाइगर जगरनाथ दा नहीं रहे!
आज झारखण्ड ने अपना एक महान आंदोलनकारी, जुझारू, कर्मठ और जनप्रिय नेता खो दिया। चेन्नई में इलाज के दौरान आदरणीय जगरनाथ महतो जी का निधन हो गया।
परमात्मा दिवंगत आत्मा को शांति प्रदान कर शोकाकुल परिवार को दुःख की यह विकट घड़ी सहन करने की…— Hemant Soren (@HemantSorenJMM) April 6, 2023