Divya Pandey: ఓ అమ్మాయి తాను మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించానన్న సంతోషంతో పొంగిపోయింది. బంధువులు, తండ్రి పనిచేసే ఆఫీసు ఉన్నతాధికారులు పిలిచి సన్మానాలు చేస్తుంటే ఎంతో ఆనందించింది. ఇక అంతా మంచే జరుగుతుందనుకుంటున్న టైంలో అనుకోని ట్విస్ట్ ఎదురైంది. సివిల్స్‌లో ఆమెకు ర్యాంకు రాలేదని.. వేరే అమ్మాయి పేరుతో ఆమె పేరు మ్యాచ్ అవటంతో తప్పు జరిగిపోయిందని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన 24 ఏళ్ల దివ్య పాండే యూపీఎస్సీ పరీక్షలు రాసింది. పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఫలితాలు విడుదలయ్యాయి.
ఉత్తర ప్రదేశ్‌లో ఉంటున్న దివ్య స్నేహితురాలినుంచి దివ్యకు ఫోన్ వచ్చింది. దివ్య సివిల్స్‌లో 323వ ర్యాంకు సాధించినట్లు ఆమె తెలిపింది. స్నేహితురాలు చెప్పిన విషయం విని దివ్య ఎంతో సంతోషించింది. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించినందుకు పొంగిపోయింది. ఆమె సివిల్స్‌కు ఎంపికైన సంగతి బంధువులు, స్థానికులు, ఇలా అందరికీ తెలిసిపోయింది. వాళ్లు శుభాకాంక్షలతో ముంచెత్తసాగారు. ఈ నేపథ్యంలో దివ్య తన ర్యాంకు విషయాన్ని మరోసారి కన్‌ఫర్మ్ చేసుకోవాలనుకుంది. ఇందుకోసం ఇంటర్‌నెట్ సెంటర్‌కు వెళ్లింది. అయితే, వెబ్‌సైట్ పనిచేయకపోవటం వల్ల ఫలితాలు రాలేదు.
ఇక, చేసేదేమీ లేక ఇంటికి తిరిగొచ్చేసింది. తనకు ర్యాంకు వచ్చేసినట్లేననుకుంది. దివ్య తండ్రి పనిచేసే సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ అధికారులు దివ్యను ఆఫీసుకు పిలిచి మరీ సన్మానం చేశారు. ఇలా అంతా బాగుందనుకుంటున్న టైంలో ఓ నిజం తెలిసింది. సివిల్స్‌లో 323వ ర్యాంకు సాధించింది దివ్య పాండే కాదని, సౌత్ ఇండియాకు చెందిన దివ్య పి అని తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె సంతోషం ఆవిరైంది. స్నేహితురాలు చేసిన పొరపాటు కారణంగా ఇదంతా జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు. జరిగిన తప్పుకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Shot: వీడియో: ఇదెక్కడి డబుల్ మీనింగ్ యాడ్ రా బాబు? అన్నీ పచ్చి బూ*లే!