సమాజంలో మార్పు రావాలంటే.. ముందుగా మీ నుంచి మొదలవ్వాలి.. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్ బాగా అర్థం చేసుకున్నాడు. ప్రంపచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు పరిష్కారం దిశగా తన వంతు కృషి చేశాడు. అతడి ఆలోచన అధికార యంత్రాంగాన్ని కదిలించింది. ప్రజల్లో మార్పు తీసుకువచ్చింది. ఏం జరిగింది అంటే..
భూమిని వణికిస్తున్న అతి పెద్ద సమస్య కాలుష్యం. అన్ని రకాల కాలుష్యాల మధ్య మన జీవితాలు సాగుతున్నాయి. ఇక వీటన్నింటిలోకి మానవాళిని ఎక్కువగా భయపెడుతుంది ప్లాస్టిక్, పాలిథీన్ కవర్లు. వాడటానికి సౌకర్యంగా ఉంటాయి.. తక్కువ ధరకు లభిస్తాయి అనే కారణాలతో వీటిని విరవిగా వాడుతున్నాం. అవసరం తీరాక ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. ఆఖరికి సముద్రాల్లో కూడా ప్లాస్టిక్, పాలిథీన్ కవర్ల గుట్టలు ఏర్పడుతున్నాయి అంటే ఏ రేంజ్‌లో వీటిని వినియోగిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనితో లాభాలకన్నా.. పర్యవరణానికి వాటిల్లే ముప్పు అధికం. ప్లాస్టిక్, పాలిథీన్ కవర్లు భూమిలో కరగవు. కాల్చితే మరిన్ని సమస్యలు. మరి దీనికి పరిష్కారం.. ఆ దిశగా సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు.
అయితే ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్, పాలిథీన్ కవర్ల వినియోగం గ్రామాల్లో కూడా పెరిగిపోయింది. వాటిని వాడిని తర్వాత ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. పంట పొలాల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ నివారణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజల్లో మార్పు రాకపోతే వేస్ట్. ఆ దిశగా ఆలోచన చేశాడు ఓ గ్రామ సర్పంచ్. తన ఊరి ప్రజలకు పాలిథీన్, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడమే కాక.. వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అడ్డుకట్ట వేయడం కోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు. అది విజయవంతం అయ్యింది. ఇంతకు అతడు ఏం చేశాడు.. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
పాలిథీన్ చెత్త తనకు ఇస్తే.. బంగారు కాయిన్ ఇస్తాను అనే బంపరాఫర్ ప్రకటించాడు జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని సాదివారా గ్రామానికి చెందిన సర్పంచ్ ఫరూఖ్ అహ్మద్ ఘనై. ఇతడు సర్పంచ్ మాత్రమే కాక లాయర్ కూడా. ఇక పచ్చని కొండల మధ్య వెలసిన తన గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ చెత్త దర్శనం ఇవ్వడం అతడిని కలచి వేసింది. ఇప్పుడే ఈ సమస్యను పరిష్కరించకపోతే.. భవిష్యత్తులో సురక్షితమైన తాగు నీరు, సారవంతమైన భూమి వంటి వనరులు ఉండవు అని అర్థం చేసుకున్నాడు. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు.
దానిలో భాగంగా పాలిథీన్ చెత్తతో రండి.. బదులుగా గోల్డ్ కాయిన్ తీసుకెళ్లండి అని ప్రకటించాడు. ఎవరైతే 20 క్వింటాళ్లకు తగ్గకుండా పాలిథీన్ చెత్త తీసుకువస్తారో.. వారికి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాను అని ప్రకటించాడు. 20 క్వింటాళ్ల కన్నా తక్కువ చెత్త తెచ్చిన వారికి వెండి నాణెం ఇస్తున్నాడు. బంగారం మీద ఆశతో.. ఊరి ప్రజలు చెత్తను సేకరించి సర్పంచ్‌కు అప్పగించి.. గోల్డ్ కాయిన్ తీసుకుంటున్నారు. ఈ ఐడియా సక్సెస్ కావడంతో జిల్లా అధికారులు సైతం.. దీన్ని ఫాలో అవుతున్నారు. అన్ని పంచాయితీల్లో.. ఈ ఆఫర్‌ను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ సర్పంచ్ ఆలోచన మీకు ఎలా అనిపించింది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.