జమ్మూ కశ్మీర్ లో ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. అప్పుడే పుట్టిన శిశువు మరణించిందని ఓ సిబ్బంది తెలియజేయడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి సమాధి చేసేందుకు రెడీ అయ్యారు. అంతలోనే ఆ శిశువులో కదలికలు వచ్చాయి. ఈ సీన్ ను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక చివరికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఎట్టకేలకు తెలుసుకుని ఆ శిశువుని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ కశ్మీర్ లోని బంకూట్ ప్రాంతం. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నాడు బషరత్ అహ్మద్. ఇతనికి గతంలో వివాహం జరగగా ఇటీవల అతని భార్య ఆసుపత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. కానీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంతో శిశువు మరణించిందని నిర్ధారించారు. ఇక వైద్యులను నమ్మిన ఆ కుటింభికులు ఆ శిశువుని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: B Pharmacy: అమ్మకి ఫోన్ చేసి.. అంతలోనే దారుణం! ఒక్క క్షణంలో అంతా మారిపోయింది!
అయితే అక్కడ పూడ్చిపెట్టే క్రమంలోనే ఒకరు శిశువులో కదలికలను గమనించారు. ఈ సీన్ ను చూసిన అక్కడి వారంత ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక వెంటనే ఆ శిశువుని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక చనిపోయిందని చెప్పిన వైద్యులు, నర్సుల తీరుపై పై అధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఇక వెంటనే స్పందించిన అధికారులు ఆసుపత్రి నర్స్, స్వీపింగ్ కార్మికురాలిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.