చీకటిలో మన నీడ మనకు కనిపించదు కానీ, మిగతా సమయాల్లో నీడను చూసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం వేళ మన నీడ కనిపించదట. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. మధ్యాహ్నం వేళ సూర్యుడి ప్రతాపం సమయంలో నీడ కనిపించడం లేదంటే..
చిన్నప్పుడు నీడను చూసి జడుసుకుని ఉంటాం. అలాగే నీడతో కూడా ఆడి ఉంటారు. చీకటిలో మన నీడ మనకు కనిపించదు కానీ, మిగతా సమయాల్లో నీడను చూసుకోవచ్చు. అదేదో సినిమాల్లో నీడ కనిపించడం లేదు సార్ అని హీరో ఫిర్యాదు చేస్తాడు గుర్తుందా..అలా మనం కూడా ఇవ్వాలేమో కంప్లైంట్. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం వేళ మన నీడ కనిపించదట. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. మధ్యాహ్నం వేళ సూర్యుడి ప్రతాపం సమయంలో నీడ కనిపించడం లేదంటే ఇదేదో దేవుడు లీల అనుకునేరూ.. కాదు దీనికి శాస్త్రీయత ఉంది. అద్భుతమైన, అరుదైన సంఘటన మంగళవారం ఎక్కడ చోటుచేసుకోబోతోంది అంటే..?
బెంగళూరులో ఈ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. సూర్యుడు వెలుగు దేనిమీద అయినా పడుతుండగా.. దాని నీడ కనపించదు. దీన్ని ‘జీరో షాడో డే’ గా పిలుస్తున్నారు. శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం.. మధ్యాహ్నం 12.17 గంటలకు ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ క్యాంపస్‌లో 60 నుంచి 120 సెకండ్లపాటు పొడవైన వస్తువుల నీడ కనిపంచదు. ఇది సాధారణంగా కర్కాటక రాశి మరియు మకర రాశి మధ్య ప్రాంతాలలో జీరో షాడో ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనం రెండింటిలోనూ సూర్యుని క్షీణత ఆ ప్రాంతాల అక్షాంశానికి సమానంగా ఉంటుంది. ఆ సమయంలో ఈ వింత చోటుచేసుకోనుంది. అందువల్ల నిలువుగా ఉండే ఏదైనా వస్తువు నీడను వేయదు. అలాగే ఈ ఏడాది ఆగస్టు 18న కూడా ఇలా జరగనుందట. 2021లో ఒడిశాభువనేశ్వర్‌లో ఈ అద్భుతం జరిగింది.