దేశంలో ఇప్పుడు మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో పోటీలో ఉంటున్నారు. రక్షణ శాఖలో పలువురు మహిళలు తమ సత్తా చాటుతున్నారు. నేరస్తుల గుండెల్లో సింహ స్వప్పంగా మారుతున్నారు. ఐపీఎస్ అధికారిణి, చెన్నై నార్త్ జాయింట్ కమిషనర్ రమ్య భారతి అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చీకటిలో ఒంటరిగా సైకిల్‌పై వెళ్లి పెట్రోలింగ్ నిర్వహించారు. సివిల్ డ్రెస్ లో సైకిల్ పై ఆమె రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అనుమానాలు వచ్చినా ఎంతటి వారైనా అరెస్ట్ చేయాలని.. ఎవరి వాహనాలైనా సీజ్ చేయాలని ఆదేశించారు.
రాత్రి విధుల్లో ఉన్న గార్డులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాత్రంతా నిద్రపోకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని గార్డులకు సూచించారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 4 గంటల వరకు సైకిల్ తొక్కుతూ తన ఆధీనంలోని ప్రాంతాలను పర్యవేక్షించారు. రమ్య భారతి అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.
రమ్య భారతి 2008లో తమిళనాడు విభాగానికి చెందిన ఐపీఎస్ అధికారిణి. తమిళనాడు ప్రభుత్వం గత జనవరిలో ఆమెను చెన్నై నార్త్ జాయింట్ కమిషనర్‌గా నియమించింది. రాత్రిపూట రమ్య భారతి గస్తీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. ఆమెను అభినందించడమే కాదు.. శాంతిభద్రతల పరిరక్షణకు తమిళనాడు పోలీసులు ఉక్కు హస్తంతో పనిచేస్తారని ముఖ్యమంత్రి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
The 2008-batch IPS officer RV Ramya Bharathi, who is posted as the joint commissioner of Chennai city north zone, decided to ride on her cycle to surprise the policemen on patrol on Thursday. @aselvarajTOI pic.twitter.com/iBGuc5bq0X
— Selvaraj Arunachalam (@selvarajtoi) March 24, 2022