ఇది ఇద్దరు మహిళా అధికారుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒక మహిళా పోలీస్ కి, మహిళా కలెక్టర్ కి మధ్య జరుగుతున్న యుద్ధం. కలెక్టర్ రోహిణి తన ప్రైవేట్ ఫోటోలను ఇతర కలెక్టర్లకు పంపించిందని రూప ఆరోపించగా.. తన ప్రైవేట్ ఫోటోలను రూప సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం కరెక్ట్ కాదని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కలెక్టర్ రోహిణి, రూప ఐపీఎస్ ల మధ్య గొడవకు కారణం ఏంటి?
ఇద్దరు మహిళా ప్రభుత్వ అధికారుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. మహిళా కలెక్టర్ పై మహిళా ఐపీఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహిళా కలెక్టర్ వ్యక్తిగత ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి మరీ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వీరి మధ్య జరుగుతున్న యుద్ధం ఫలితంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండడంతో ఒక్కసారిగా మహిళా అధికారులిద్దరూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అసలు వీరి మధ్య గొడవకు కారణం ఏంటి? ఐఏఎస్ రోహిణిపై ఐపీఎస్ రూపా ఎందుకు ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారు? వీరిద్దరికీ ఎక్కడ చెడింది? ఆ గొడవ ఏంటి?
కర్ణాటకలో మహిళా అధికారుల మధ్య యుద్ధ వాతావరణం నడుస్తోంది. మహిళా ఐపీఎస్ రూపా, మహిళా ఐఏఎస్ రోహిణిల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రోహిణికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో ఆదివారం పలు పోస్ట్ లు చేశారు. రోహిణి పాల్పడ్డ అక్రమాలు ఇవీ అంటూ ఫేస్ బుక్ లో ఆమె వ్యక్తిగత ఫోటోలను అప్ లోడ్ చేశారు రూపా. ఆమె అక్రమాలకు పాల్పడిందని రోహిణిపై రూపా ఆరోపణలు చేశారు. అక్రమాలకు పాల్పడ్డ రోహిణిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా పని చేస్తుండగా.. రోహిణి సింధూరి కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ గా ఉన్నారు.
గత ఏడాది మైసూరు కలెక్టర్ గా పని చేసిన రోహిణి సింధూరి బదిలీ సమయంలో క్యాట్ లో కేసు వేశారు. అప్పుడు ఆమె తరపున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదించి సహకరించింది. అయితే కన్నడిగులైన తమలాంటి వారి తరపున వాదించడానికి ఎందుకు వెసులుబాటు కల్పించలేదని రూపా ప్రశ్నించారు. తన ఫేస్ బుక్ ఖాతాలో అనేక ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్ చేశారు. తాను మూడేళ్ళ కిందట యాదగిరిలో పని చేసి బెంగళూరుకి బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్ లో కేసు వేస్తే అడ్వకేట్ జనరల్ తన తరపున ఎందుకు వాదించలేదని ఆమె ప్రశ్నించారు. రోహిణి తన వ్యక్తిగత ఫోటోలను ఇతర ఐఏఎస్ లకు పంపించారని. ఇది సర్వీస్ రూల్స్ ని అతిక్రమించడమే అవుతుందని రూపా అన్నారు.
అయితే రూపా చేసిన ఆరోపణలపై ఐఏఎస్ రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ రూప తన వ్యక్తిగత ఫోటోలను ఫేస్ బుక్ లో విడుదల చేయడంపై న్యాయ పోరాటం చేస్తానని రోహిణి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రూప ఐపీఎస్ నిరాధార ఆరోపణలతో తనపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రూప మతి స్థిమితం కోల్పోయిందని విమర్శించారు. వార్తల్లో ఉండాలన్న తపనతో ఇలా తనపై ఆరోపణలు చేస్తుందని.. ఆమెది మానసిక రోగమని, ఆ రోగానికి వైద్యం చేయించుకోవాలని రోహిణి వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ ఆమె వ్యక్తిగత ఫోటోలను పంపించలేదని, ఎవరికి పంపించానో బహిరంగంగా చెప్పాలని అన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉంటూ ఇలా ఇష్టానుసారం తన ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం కరెక్ట్ కాదని ఆమె మండిపడ్డారు. మరి ఇద్దరు మహిళా అధికారుల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.