పొట్టకూటి కోసం సొంత ప్రాంతాన్ని వదిలి వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన ఆ యువకుడి కలను డ్రీమ్ 11 యాప్ నెరవేర్చింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. అందుకు ఆ యువకుడు ఎంత పెట్టుబడి పెట్టాడో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
డ్రీమ్ 11.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్.. చాలా మంది ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ అదృష్టం అతి కొద్ది మందికే దక్కుతుంది. అందునా.. ముప్పై.. నలువై రూపాయలు పెట్టుబడిగా పెడితే ఏ వందో.. రెండొందలు వస్తుంటాయి. కానీ ఓ ఆటో డ్రైవర్ కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అది కూడా కేవలం 39 రూపాయలు పెట్టుబడిగా పెట్టి.. ఈ జాక్‌పాట్‌ను కొట్టాడు. దీంతో అతని జీవితమే మారిపోయింది. ఆ వివరాలు..
డ్రీమ్ 11.. ఓ ఆటో డ్రైవర్ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే అతడ్ని కోటీశ్వరుడ్ని చేసింది. 39 రూపాయలు పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు సంపాదించి పెట్టింది. అనే వ్యక్తికి ఈ బంఫర్ ఆఫర్ తగిలింది. ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ కూడా తెరవని నౌషాద్ అన్సారీకి.. బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కారణంగా కోటి రూపాయల రివార్డ్ లభించింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతడికి ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేదట. డ్రీమ్ 11లో కోటి గెలిచాకనే.. అతడు బ్యాంక్ ఖాతాను తెరిచాడు. గురువారం స్థానికంగా ఉన్న బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. అనంతరం డ్రీమ్ 11 వ్యాలెట్‌లో ఉన్న డబ్బును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అన్ని ట్యాక్స్‌లు పోను.. అతని ఖాతాలో 70 లక్షల జమ అయ్యాయి.
ఈ విషయంపై నౌషాద్ అన్సారీ మాట్లాడుతూ.. పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తన జీవితాన్నే మార్చేసిందని తెలిపాడు. “నేను 2021 నుంచి డ్రీమ్ 11లో ఆడుతున్నా. ఇప్పటి వరకు 45 సార్లు టీంలు సెట్ చేశా. పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్46 వది. ఈసారి 39 రూపాయలతో పందెం కాశాను. లక్కీగా నాకు కోటి రూపాయల రివార్డ్ వచ్చింది. ఆటో నడిపితే రోజుకు మూడు.. నాలుగు వందలు మాత్రమే వచ్చేవి. కానీ ఒకేసారి ఇన్ని డబ్బులు రావడంతో నా బాధలు తొలిగిపోయాయి..” అని అన్సారీ చెప్పుకొచ్చాడు.