ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కొంత మంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకు వస్తుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా వాహనాలు నడిపినా.. ఇతరులు చేసే తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్పోరేషన్ ఉద్యోగులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ఆర్టీసీ ఉద్యోగులకు కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఆర్టీసీ లో ఉద్యోగాలు చేసేవారికి ప్రమాద భీమా మొత్తాన్ని రెట్టింపు చేసింది. దీపావళి పండుగ పురస్కరించుకొని కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద భీమా రూ.50 లక్షల నుంచి మరో రూ.50 లక్షలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఎస్‌బీఐతో కార్పొరేషన్ ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది.
విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రమాద వశాత్తు మరణిస్తే ఈ బీమా సదుపాయం లభిస్తుంది. గతంలో ఆర్టీసీ సిబ్బంది ప్రమాద వశాత్తు చనిపోయినా.. అంగవైకల్యం చోటు చేసుకున్నా.. భారీ మొత్తంలో బీమా పరిహారం మాత్రం దక్కేది కాదు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు కోటి రూపాయల బీమా సౌకర్యం వర్తిస్తుంది. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ದೇಶದ ರಸ್ತೆ ಸಾರಿಗೆ ಸಂಸ್ಥೆಗಳ ಇತಿಹಾಸದಲ್ಲಿಯೇ ಪ್ರಪ್ರಥಮ ಬಾರಿಗೆ ಕೆ. ಎಸ್ ಆರ್ ಟಿ ಸಿ ಸಿಬ್ಬಂದಿಗಳಿಗೆ ರೂ.1 ಕೋಟಿ ಮೊತ್ತದ ಅಪಘಾತ ವಿಮಾ ಯೋಜನೆ ಸೌಲಭ್ಯ ಜಾರಿ. pic.twitter.com/MpH4Zdf0ON
— KSRTC (@KSRTC_Journeys) November 14, 2022