ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు పొందినది భారతీయ రైల్వే సంస్థ. స్వాతంత్రానికి ముందు నుంచే ఇది ప్రభుత్వ సంస్థగా కొనసాగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు జరిగాయి. తాజాగా దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసులు ప్రారంభించింది. ‘భారత్ గౌరవ్ పథకం’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి ప్రైవేటు రైలు తమిళనాడు నుంచి మహారాష్ట్రకి బయలుదేరింది. దీంతో దేశంలోనే తొలి ప్రయివేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనతను దక్షిణ రైల్వే దక్కించుకుంది. అయితే ఈ ప్రైవేటు రైలులో ఉండే ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక ప్రైవేటు ఆపరేటు నడుపుతున్న ఈ భారత్ గౌరవ్ ట్రైన్ కోయబత్తూరు, షిరిడీ మధ్యలో నడుస్తుంది. ఈ ప్రయాణంలో ట్రైన్ చాలా స్టేషన్ లల్లో ఆగుతుంది. తిరుప్పూరు, ఈరోడ్ , సేలం, యలహంక, ధర్మవరం, మంత్రాలయం, వాడి మొదలైన స్టేషన్ లల్లో ఆగుతుంది. మంత్రాలయం వద్ద 5 గంటల సేపు ఆగుతుంది. ఈ ప్రైవేటు రైలులో చాలా అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఒక్క డాక్టర్ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు. రైల్వే పోలీసులతో పాటు ప్రైవేటు భద్రత సిబ్బంది కూడా ఈ రైలులో రక్షణ కల్పిస్తారు. వీళ్లతో పాటు ఓ ఎలక్ట్రిషియన్, ఏసీ మెకానిక్, ఇంక అగ్నిమాపక అధికారి కూడా ఉండారు. మొత్తంగా లగ్జరీ అనుభూతిని ఈ రైలు అందిస్తుంది. సాంప్రదాయా వంటలతో పాటు ఇతర వెరైటి ఆహార పదార్ధాలు లభిస్తాయి. ప్రయాణికులను ఎంటర్ టైన్ చేయడానికి హై బేస్ సౌండ్ స్పీకర్, రైల్ రేడియో జాకీని ఫిట్ చేశారు. పొగ త్రాగడానికి ప్రత్యేక బోగి అందుబాటులో ఉంది.
ఈ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం త్వరలో ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. “సౌత్ స్టార్ రైల్” పేరుతో ఉన్న సంస్థ ఈ టూరిస్ట్ రైలును ఆపరేట్ చేస్తోంది. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, నాన్ ఏసీ బెర్తులు అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ నాన్ ఏసీకి రూ.2,500, థర్డ్ ఏసీకి రూ.5,000, సెకండ్ ఏసీకి రూ.7,000, ఫస్ట్ ఏసీకి రూ.10,000 చెల్లించాలి. ప్రస్తుతం ఈ రైలు ద్వారా కొయంబత్తూర్ నుంచి షిరిడీకి, షిరిడీ నుంచి కొయంబత్తూరుకు రైలు ప్రయాణం మాత్రమే కవర్ అవుతుంది. మరి.. ఈ ప్రైవేటు ట్రైన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
India’s first-ever private train service under Bharat Gaurav scheme flagged off yesterday from Coimbatore.
The train will cover several historical destinations on the route while giving the passengers an insight into the cultural heritage of the country.#PrivateTrain https://t.co/k2p8bZcpac
— Trichy IT (@trichyit) June 15, 2022