ప్రేమ సరిహద్దులు దాటి మరీ ప్రయాణం చేస్తుంది. దీనికి పెళ్ళై, పిల్లలున్న మహిళలేం తక్కువ కాదు. ఫేస్ బుక్, పబ్జీ వంటి ఆన్ లైన్ వేదిక ద్వారా పరిచయాలు పెంచుకుని లవర్స్ కోసం వేరే దేశాల నుంచి భారత్ కి వస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే యువతి మాత్రం ప్రియుడి కోసం ఇంట్లో అబద్ధం చెప్పి మరీ పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది.
పబ్జీ ఆన్ లైన్ గేమ్ ద్వారా పరిచయం చేసుకుని సచిన్ తో ప్రేమలో పడి భారత్ కి వచ్చిన సీమా హైదర్ ని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో పని చేస్తాడని.. ఈమెకు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సీమా హైదర్ తరహాలోనే మరో యువతి కూడా ప్రేమ కోసం సరిహద్దులు దాటింది. కాకపోతే సీమా హైదర్ ప్రియుడి కోసం భారత్ కి వస్తే.. ఇక్కడ ఈ యువతి మాత్రం తన లవర్ కోసం పాకిస్తాన్ వెళ్ళింది. అది కూడా సీమా హైదర్ లానే పెళ్ళై, పిల్లలున్న యువతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఊరు వెళ్లి వస్తాను అని చెప్పి ప్రియుడి కోసం పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రియుడితోనే ఉంటాను అని చెబుతోంది.
రాజస్థాన్ లోని భివాడి జిల్లాకి చెందిన పెళ్ళైన మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్తాన్ లోని నార్త్ వెస్టర్న్ ఖిబర్ పక్తుంక్వా ప్రావిన్స్ లోని దీర్ సిటీకి వెళ్ళింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ఆమె పేరు అంజు, వయసు 35. తన భర్త అరవింద్ కి జైపూర్ వెళ్తున్నాను.. కొన్ని రోజులు అక్కడే ఉంటాను అని చెప్పి ఇంట్లోంచి వచ్చేసింది. అయితే అంజు భర్త అరవింద్.. తన భార్య సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిందని ఆదివారం నాడు మీడియా ద్వారా తెలుసుకుని షాకయ్యాడు. అంజు వాట్సాప్ ద్వారా తనకు టచ్ లో ఉందని, ఆదివారం సాయంత్రం 4 గంటలకు తనకు కాల్ చేసి లాహోర్ లో ఉన్నట్టు చెప్పిందని.. రెండు, మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు వెల్లడించాడు.
అంజు లవర్ గురించి అరవింద్ ని అడగగా.. ఆ ప్రేమ వ్యవహారం తనకు తెలుసునని.. అయితే తన భార్య తిరిగి ఇంటికొస్తుందన్న నమ్మకం ఉందని వెల్లడించాడు. అరవింద్ భివాడి జిల్లాలో పని చేస్తున్నాడు. అంజు కూడా ఓ ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తుంది. జాతీయ మీడియాతో మాట్లాడిన అరవింద్.. విదేశీ ఉద్యోగం కోసం 2020లో తన భార్య పాస్ పోర్ట్ కి అప్లై చేసినట్లు వెల్లడించాడు. అంజు, అరవింద్ తో కలిసి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అరవింద్ భివాడిలో అద్దె ఫ్లాట్ లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వీరు ఉన్న చోటే అంజు సోదరుడు కూడా ఉంటున్నాడు.
గురువారం నాడు అంజు జైపూర్ వెళ్తున్నానని చెప్పి భివాడి నుంచి పాకిస్తాన్ కి ప్రయాణమైంది. అక్కడ 29 ఏళ్ల ఫేస్ బుక్ స్నేహితుడైన నస్రుల్లాహ్ ని కలుసుకుంది. నస్రుల్లాహ్ మెడికల్ ఫీల్డ్ లో పని చేస్తాడు. కొన్ని నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. నస్రుల్లాహ్ ని ప్రేమిస్తున్నానని.. అతను లేకుండా జీవించలేనని ఆమె మీడియాతో వెల్లడించింది. అయితే అంజు సందర్శనార్థం పాకిస్తాన్ వచ్చిందని.. పెళ్లి ఆలోచన ఆమె మైండ్ లో లేదని నస్రుల్లాహ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మొదట అంజు పాక్ పోలీసుల కస్టడీలో ఉంది. ఆమె ప్రయాణ పత్రాలు ధృవీకరించిన తర్వాత ఆమెను విడుదల చేశారు. అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఆమెను తిరిగి భారత్ కి వెళ్లేందుకు అనుమతించారు. దేశానికి చెడ్డ పేరు రాకూడదని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆమెకు భద్రత కల్పించారని జాతీయ మీడియా వెల్లడించింది. అయితే అంజు 30 రోజుల పాటు పాకిస్తాన్ లో ఉండేందుకు అనుమతి కోరగా అధికారులు ఆమెను అక్కడ ఉండేందుకు అనుమతిచ్చారు.
सीमा की तरह अंजू ने पार की सरहद,देखिए ये रिपोर्ट
Watch live TV: https://t.co/oX7hvvK3HX#SeemaHaider #Anju #Pakistan @surabhi_tiwari_ @Rashkagauri pic.twitter.com/clMZJeJYAX
— India Daily Live (@IndiaDLive) July 24, 2023