బతుకుదెరువు కోసమో.. లేక ఉద్యోగం నిమిత్తమో.. మన దేశం వాళ్లు విదేశాలకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా అరబ్ దేశాలకే వెళ్తుంటారు. ఎక్కువగా డ్రైవర్, భవన నిర్మాణ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ వ్యక్తికి 11 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ దేశ హైకోర్టు వెల్లడించింది. ఎందుకు అంటే..
దుబాయ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి భారీ మొత్తం పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది యూఏఈ సుప్రీం కోర్టు. ఈ సంఘటన మూడు సంవత్సరాల క్రితం అనగా 2019లో చోటు చేసుకుంది. ముహమ్మద్ బైగ్ మీర్జా అనే యువకుడు దుబాయ్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన చివరి సెమిస్టర్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో అతడు తన బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ముహమ్మద్ బైగ్ ప్రయాణిస్తున్న బస్సు దారుణ ప్రమాదానికి గురైంది. మెట్రో స్టేషన్ పార్కింగ్‌లోకి ప్రవేశించే చోట బస్సు డ్రైవర్ ఓవర్‌హెడ్ హైట్ బారియర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ యాక్సిడెంట్‌లో 17 మంది మృతి చెందారు.. వీరిలో 12 మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో ముహహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి 1 మిలియన్ దిర్హామ్‌లు పరిహారంగా చెల్లించాలని యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ చెప్పింది. అయితే ఆ పరిహారం సరిపోదని.. బాధితుడి బంధువులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్లయింట్ ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని, సుధీర్ఘకాలంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని.. ఈ ప్రమాదంలో అతడి బ్రెయిన్ సగభాగం దెబ్బతిందని.. ప్రధాన అవయవాలన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయని.. చదువు కూడా పూర్తి చేయలేకపోయాడని.. ప్రమాదం కారణంగా అతడి జీవితమే నాశనం అయ్యిందని ముహమ్మద్ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించాడు.
ఇంతకాలం వాదనలు విన్న అనంతరం.. బుధవారం యూఏఈ సుప్రీం కోర్టు ముహమ్మద్‌కు ఐదు మిలియన్ దిర్హామ్(మన కరెన్సీలో రూ.11 కోట్లు) చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. ఇక ప్రమాదానికి కారణమైన డ్రైవర్ (ఒమన్‌కు చెందిన వ్యక్తి)కి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అంతేకాక బాధిత కుటుంబానికి 3.4 మిలియన్ దిర్హామ్‌ల బ్లడ్ మనీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.