ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృభింస్తోంది. ఈ తరుణంలో కరోనా పరీక్షల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడప్పుడు ఈ టెస్టుల్లో వచ్చే రిపోర్టులు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్ లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్ లో తనకు ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్ లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ ఈ వ్యక్తి వీడియోలో వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : ఓ వ్యక్తిని పగ పట్టిన కరోనా! 10 నెలల్లో 43 సార్లు పాజిటివ్!
వివరాల్లోకి వెళ్తే.. యూకేలో ఉంటున్న భారత సంతతి వ్యక్తి మనోజ్ లాద్వా.. తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్ నుంచి ఇండియా వచ్చాడు. విమానం ఎక్కేముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. డిసెంబర్ 30న వర్జీన్ అట్లాంటిక్ ఫ్లైట్ లో ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు లాద్వా. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. లండన్ లో నెగెటివ్ రావడం.. ఇక్కడ పాజిటివ్ రావడంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని కోరారు.
ఇది కూడా చదవండి : కరోనా మాత దేవాలయం… కట్టారు- కూల్చేసారు. ఎందుకో తెలుసా?అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్ సెంటర్ కు షిఫ్ట్ చేశారు. ఫలితంగా లాద్వా తన మామ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు. దీంతో ఆగ్రహాం చెందిన మనోజ్.. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడు. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ వీడియోలో లాద్వా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.