దునియాలోనే అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ ఒక ఇండియన్ క్లైంబర్ తప్పిపోయింది. ఆమె కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించి వస్తుండగా ఒక భారతీయ పర్వతారోహకురాలు తప్పిపోయింది. అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించి తిరిగి వస్తుండగా క్యాంప్-4 దగ్గర బల్జీత్ కౌర్ అనే భారతీయ పర్వతారోహకురాలు కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఎట్టకేలకు బల్జీత్ కౌర్ జాడను కనిపెట్టిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమె ప్రాణాలతోనే ఉందని.. బల్జీత్‌ను ఏరియల్ సెర్చ్ టీమ్ గుర్తించిందని పయనీర్ అడ్వెంచర్ ప్రెసిడెంట్ పసాంగ్ షెర్ఫా తెలిపారు. అలాగే అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ మరో భారత పర్వతారోహకుడు మిస్సయ్యాడు.
రాజస్థాన్‌లోని కిషన్గఢ్కు చెందిన అనురాగ్ మాలు అనే పర్వతారోహకుడు ఏప్రిల్ 17న కనిపించకుండా పోయాడు. అనురాగ్ మాలూ కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఇక, ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో అన్నపూర్ణ పర్వతం పదో స్థానంలో ఉంది. సముద్ర మట్టం నుంచి 8,091 మీటర్ల ఎత్తులో ఈ పర్వతం ఉంటుంది. ఈ పర్వతంలోని క్యాంప్-3 నుంచి దిగుతుండగా 6 వేల మీటర్ల ఎత్తు నుంచి అనురాగ్ కిందకు పడిపోయాడని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ఛైర్మన్ మింగ్మా షెర్పా తెలిపారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ ఒకే నెలలో 8 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న నాలుగు పర్వతాలను అధిరోహించిన తొలి ఇండియన్ విమెన్‌గా రికార్డులకెక్కారు.
Indian climber Baljeet Kaur found alive above 7,300m, long-line rescue underway. More: https://t.co/oNa4pR5kp7 pic.twitter.com/u8IGgis3Kw
— Everest Today (@EverestToday) April 18, 2023