ఈ మద్య ఆకాశ మార్గన ప్రయాణిస్తున్న వారికి ప్రాణభయం పట్టుకుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అని భయపడుతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికీ విమానాల్లో టెక్నికల్ ఇబ్బందులు రావడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తున్నారు.
ఇటీవల దేశంలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. విమానయాన సిబ్బంది ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కొన్నిసమయాల్లో పైలెట్లు ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తున్నారు. తాజాగా భారత సైన్యానికి చెందిన చిరుతా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
అరుణాచల్ ప్రదేశ్ మండలా పర్వత ప్రాంతంలో మరో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. మండలా పర్వతం ప్రాంతంలో సెంగే నుంచి మిసామారి వైపు ఎగురుతున్న హెలికాప్టర్ ఒక్కసారిగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ కుప్పకూలిపోయిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్రాష్ అయిన చిరుత హెలికాప్టర్ గురించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 9.15 కు భారత సైన్యానికి చెందిన చితా(చిరుత) హెలికాప్టర్ బయలు దేరిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయి క్రాష్ అయ్యిందని.. ఇందులో ఓ సీనియర్ ఆపీసర్ తో సహా ఇద్దరు సిబ్బంది, పైలట్ ఉన్నాడని అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్, పీఆర్ వో డిఫెన్స్ గౌహతి మీడియాకు తెలియజేశారు. దీరంగ్ నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో పెద్ద శబ్ధం వచ్చిందని.. మండలా వైపు పెద్ద ఎత్తున పొగలు చూసినట్లు స్థానికులు తెలిపారు. గత ఏడాది కూడా అక్టోబర్ లో అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ ప్రాంతంలో భారత ఆర్మీ కి చెందిన ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ కూలిపోయి ఘటనలో ఇద్దరు పైలట్ లతో సహా ఐదుగురు సిబ్బంది కన్నుమూశారు.
Indian Army Cheetah helicopter has crashed near Mandala hills area of Arunachal Pradesh. Search operation for the pilots has started. More details awaited: Army sources pic.twitter.com/fqD0uu767w
— ANI (@ANI) March 16, 2023