దాయాది పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వాళ్లు డిమాండ్ చేసినట్లు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తోంది. జమ్మూ కశ్మీర్లో జరగనున్న ఈ మీటింగ్‌పై దాయాది పాకిస్థాన్‌తో పాటు పొరుగున ఉన్న చైనాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ విషయంలో భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మీటింగ్‌కు చైనా హాజరవ్వడం కష్టమేనని సమాచారం. ఇక, జమ్మూ కశ్మర్ విషయంలో భారత్‌పై ఎప్పుడూ విమర్శలకు దిగే పాకిస్థాన్.. జీ20 సదస్సు విషయంలోనూ ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఈ మీటింగ్ నిర్వహించడానికి వీల్లేదని పదే పదే ఒత్తిడి తీసుకొస్తోంది. జమ్మూ కశ్మీర్లో జరగాల్సిన జీ20 సదస్సును ఆపాలంటూ సౌదీ అరేబియా, టర్కీలతో కలసి లాబీయింగ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందామ్ బాగ్చీ స్పందించారు. జమ్మూ కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. అది సహజసిద్ధమైన భారత భూభాగమని.. ప్రపంచ దేశాలు ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించబోతున్నాయని బాగ్చీ చెప్పుకొచ్చారు. అలాంటి చోట జీ20 సదస్సును నిర్వహించి తీరుతామన్నారు. కాగా, భారత్ మీద పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా, పాక్‌లకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేభ భద్రతకు ముప్పు తెచ్చేవారికి గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. ఎంతటి సవాలైనా సరే ఎదిరిస్తామని, బాధ్యులకు బుద్ధిచెబుతామని పేర్కొన్నారు.