ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమేది అంటే.. వెంటనే చైనా అని సమాధానం వస్తుంది. ఇకపై ఈ సమాధానం చెప్పే వాళ్లందరూ పప్పులే కాలేసినట్టే. ఎందుకంటే... చైనా రికార్డ్ ను భారత్ బద్దలు కొట్టింది. జనాభాలో చైనాను మించి భారత్ దూసుకుపోయింది.
ఇప్పటి వరకు ప్రపంచంలో జనాభాలో అతి పెద్ద దేశం ఏది? అని ఎవరైన ప్రశ్న అడిగితే.. ఠక్కున వచ్చే సమాధానం చైనా. అయితే ఆ సమాధానం తప్పు కానుంది. అందుకు కారణం మన భారత దేశమే. జనాభా పరంగా మన దేశం చైనాను దాటి మొదటి స్థానంలోకి చేరనుంది. ప్రస్తుతం భారత దేశ జనాభా 141 కోట్లు ఉంది. అలానే ఈ ఏడాది మధ్యలోనే చైనా రెండో స్థానానికి పడిపోనున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఐక్యరాజ్యసమితి చెందిన సంస్థ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2023’ నివేదిను తాజాగా యూఎన్ అధికారులు విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం భారత జనాభా 142.86 కోట్లతో తొలి స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసింది. చైనా జనాభా 142.57కోట్లతో రెండో స్థానం, యూఎస్ఏ 340 మిలియన్ల జనాభాతో మూడో స్థానంలో ఉంటుందని యుఎన్ అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ నివేదిక తయారుచేసినట్లు ఐక్యారాజ్యసమతి జనాభా విభాగం స్పష్టం చేసింది.
నిజానికి గతంలోనూ ఐక్యరాజ్య సమితి త్వరలోనే చైనా రికార్డుని భారత్ అధిగమిస్తుందని చెప్పింది. అయితే తాజాగా అధికారికంగా ప్రకటించింది. చివరిసారి భారత్ లో 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టారు. 2021లో జరగాల్సి ఉన్న జనాభా గణన కరోనా సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. ప్రపంచ జనాభాలో మూడింట ఓ వంతు వాటా భారత్, చైనాదే ఉందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. 2022లోనే భారత్ జనాభాను యూఎన్ నిపుణలు అంచనా వేసి.. 141 కోట్లు జనాభా ఉన్నట్లు తెలిపారు.
అయితే చైనాను దాటేసి మరీ తొలిస్థానంలో చేరుతుందని వాళ్లు ఊహించలేదు. ఇక చైనా విషయానికొస్తే…జనాభాలో ఈ తగ్గుదల 2050 వరకూ కొనసాగుతుందని అధికారులు అంచనా వేశారు. చైనా ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో అంతరాలు ఏర్పడుతున్నాయని అందుకు తగ్గట్టుగా విధానాల్లో మార్పు చేసుకోక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా యుఎన్ ఇచ్చిన నివేదికపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.