ఎందరో మహనీయుల ప్రాణత్యాగానికి ప్రతి ఫలంగా భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ప్రస్తుతం భారతీయులంతా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ”ఆజాదీ కా అమృతోత్సవాలను”కేంద్రం ఘనంగా నిర్వహిస్తోంది. అయితే ఈక్రమంలోనే తమకు భారతదేశం మీద ఉన్నప్రేమను మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు దేశ భక్తులు విభిన్నంగా చాటి చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని హైదరగడ్ ప్రాంతంలో ఉన్న మృగన్నాథ జలపాతం ఎంతో ప్రసిద్ది చెందింది. విదిషి నుంచి 35కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం అందాల్ని చూడటానికి దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు వస్తుంటారు. ఈ వర్షాకాలంలో కూడా టూరిస్టులతో వాటర్ ఫాల్స్ దగ్గర సందడి నెలకొంది. అయితే ప్రస్తుతం ఈ జలపాతం నెట్టింట వైరల్ గా మారింది. అందుకు కారణం ఆ వాటర్ పాల్స్ లోని నీళ్లు మూడు రంగులుగా మారి పర్యాటకులను ఆకట్టుకోవడమే.
భారతదేశం బానిస సంకెళ్ల నుంచి విముక్తి చెంది నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలోని అన్ని చారిత్రక కట్టడాలు త్రివర్ణ రంగును పులుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ లోని మృగన్నాథ వాటర్ పాల్స్ సైతం జాతీయ జెండా రంగులతో మెరిసిపోతోంది. జాలువారే నీళ్లలో మూడు రంగులను కలిపారు. ఇక రాళ్లపై నుంచి త్రివర్ణ జలాలు దూకుతుంటే అక్కడ అంతా దేశ భక్తి నిండుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దేశభక్తి రకరకాలుగా తెలుపుతూ ఉంటున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ యువకులు ఈ విధంగా దేశ భక్తిని చాటడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.