స్వాతంత్య్ర దినోత్సవం.. వందల ఏళ్ల బానిస సంకెళ్ల నుంచి భారతావని విముక్తి పొంది.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు. నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎందరో అమరవీరుల ప్రాణత్యాగ ఫలితం. ఆంగ్లేయుల పాలన నుంచి భారతావని స్వాతంత్య్రం పొంది… నేటితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత ప్రజలు 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. ఇక స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2021, మార్చిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే మెగా కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. ఆయనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించాడు. అనంతరం ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించాడు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసింగించారు. స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలి. నారీ శక్తికి ప్రత్యేకంగా గౌరవం ప్రకటించుకోవాలి అని తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/VmOUDyf7Ho
— ANI (@ANI) August 15, 2022