ముంబాయిలో సోనూసూద్‌కు చెందిన ఆరు ఆఫీసుల్లో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సర్వే చేపట్టింది. సాధారణ నటుడి స్థాయి నుంచి కరోనా లాక్‌డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలతో సోనూసూద్ కీర్తి అమాంతం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలతో సోనూసూద్‌కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కాగా ఆయన ఈ మధ్య కాలంలో ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుల్యారు. ఆ సమయంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాలలోకి వస్తారనే వార్తలు వచ్చాయి. కాగా ఈ ఐటీ సర్వేలకు కారణంతో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రితో భేటీ కావడంతోనే జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. సోనూసూద్‌ను ఒక రేంజ్‌లో అభిమానించిన నెటిజన్లు ఆయన ఆఫీస్‌లపై ఐటీ శాఖా చేస్తున్న సోదాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు.