బంగారు గనులు.. ఈ పేరు చెప్పగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది.. కేజీఎఫ్ సినిమా. బంగారం తవ్వకం నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండు పార్టులుగా వచ్చి ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలో ఒకప్పుడు కర్ణాటకలో ఈ బంగారు గనులు ఉండేవి. ప్రస్తుతం అవి మూతపడ్డాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్, నెల్లూరులో బంగారు గనులు ఉన్నట్లు గుర్తించారు. అయితే మన దగ్గరనే కాదు.. బిహార్‌లో కూడా ఇలానే బంగారు గనులు వెలుగు చూశాయి. ప్రస్తుతం అక్కడ తవ్వకాలకు అనుమతిస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో.. ప్రస్తుతం దీని గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ ప్రాంతంలో బంగారం ఉన్నట్లు ఎలా తెలిసింది అంటే.. చీమల ద్వారా. చీమల ద్వారా బంగారం వెలుగులోకి రావడం ఏంటో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.
40 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా బిహార్‌లోని జముయ్‌లో బంగారు గని బయటపడింది. అదీ చీమల ద్వారా. ఆ జిల్లా ప్రజల కధనం ప్రకారం.. 40 ఏళ్ల క్రితం జముయ్‌లోని ఓ ప్రాంతంలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఎండా కాలంలో చీమలు.. వేడి తట్టుకునేందుకు ఆ మర్రి చెట్టు వద్ద పెద్ద పుట్టలు పెట్టాయి. అయితే చీమలు ఆ పుట్ట కోసం చెట్టు కింద నుంచి మట్టి తెస్తుండడం గమనించారు స్థానికులు. పుట్టమట్టిని పరీక్షించగా.. అందులో తళతళలాడే కణాలు బయటపడ్డాయి. ఈ విషయం అప్పటికి స్థానికుల మధ్యే ఉండగా.. అనంతరం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళింది.
ఇది కూడా చదవండి: Bihar: 80 అడుగుల వంతెన మాయం చేసిన కేటుగాళ్ళు!దీంతో రంగంలోకి దిగిన జియోలాజికల్ సర్వే అధికారులు..జముయ్ జిల్లాలో పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇండియాలో ఇప్పటి వరకు బయటపడ్డ భారీ బంగారు నిక్షేపాలు కర్ణాటకలోని కోలార్ లో ఉన్నాయి. జముయ్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్ టన్నుల బంగారు నిల్వలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) తేల్చింది. బిహార్ లో బంగారం నిల్వలపై కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి సైతం గతేడాది లోక్ సభలో వ్రాతపూర్వక సమాధాం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Bihar: భార్యను హత్య చేసినందుకు జైల్లో భర్త.. ప్రియుడితో పారిపోయిన భార్య!
ఈక్రమంలో బంగారు గని తవ్వకాల నిమిత్తం బిహార్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఆధ్వర్యంలో బంగారం తవ్వే సంస్థలతో చర్చలు జరుపుతుంది బీహార్ ప్రభుత్వం. జీఎస్ఐ సర్వే ప్రకారం జముయ్ జిల్లాలోని కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయి. అయితే మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న జముయ్ జిల్లాలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గత 40 ఏళ్లలో ఎవరూ నిర్ధారించలేకపోయారు. కానీ చీమల ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడం గమానర్హం. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజయేండి.
ఇది కూడా చదవండి: AP Man: KTR సీఎం కావాలని.. ఆంధ్రా యువకుడి పాదయాత్ర.. విజయవాడ To హైదరాబాద్!