ఆ గ్రామంలో సారీ సారీ అంటూ అన్ని వీధుల్లో రాశారు! వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. గోడలపై, రోడ్లపై స్కూల్ ఆవరణలోని ఇలా ఎక్కడ చోటు అనుకూలంగా కనిపిస్తే అక్కడ సారీ సారీ అంటూ తాటకంత అక్షరాలతో రాసిన ఘటన బెంగుళూరులోని సుఖండకట్టేలో చోటు చేసుకుంది. ఆ ఊళ్లో ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్ దగ్గర ఎరుపు రంగుతో ఇలా సారీ సారీ అంటూ ఊరంతా రాయడంతో ఎవరు రాశారని గ్రామస్థులంత ఆలోచనలో పడ్డారు.
ఇది కూడా చదవండి: Eco Bridge: దేశంలోనే మొదటి సారి.. తెలంగాణలో పులుల కోసం ఓ వంతెన
ఇదే విషయంపై స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉండే సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇలా ఊరంత సారీ సారీ అని అని ఎవరు రాశారనేదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ఎరుపు రంగుతో ఇలా సారీ సారీ అని ఎవరు రాసి ఉండవచ్చని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.