పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఇతనికి రుచి గురించి తెలుసో లేదో కానీ, బుద్ధి మాత్రం గాడిదలు కాస్తున్నట్లుగా ఉంది. తినే రోటీపై ఉమ్ముతూ నానా ఆగం చేశాడు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. తందూరీ రోటీ ప్రియులు గనుక అయితే ఈ వీడియో చూశాక మీరు ఆ రోటీని తినే సాహసం కూడా చేయరు. ఆ వీడియో ఆధారంగా సదరు తందూరీ రోటీ తయారు చేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. ఊపిరిపీల్చుకోండి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది.
ఇదీ చదవండి: యాంకర్ రవి.. శ్వేత వర్మకు ఎందుకు సెట్ కాలేదు? వాళ్ల మధ్య అసలు జరిగింది ఇదే!
విషయం ఏంటంటే.. ఘజియాబాద్‌లోని ఓ దాబాలో రోటీలు తయారు చేసే వ్యక్తి మామూలుగా పిండి తీసుకుని బాగా చుట్టిన వస్త్రంపై పెట్టి గుడ్రంగా నొక్కాడు. అప్పటివరకు బాగానే ఉన్న అతను ఒక్కసారిగా ఆ పిండిపై తుపుక్కున్న ఉమ్మేశాడు. అంతే చూసిన వ్యక్తికి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. వెంటనే తన చేతిలోని ఫోన్ తీసి వీడియో తీయడం ప్రారంభించాడు. అక్కడ పనిచేసే సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. అతను చాలా సాధారణంగా ప్రతి రోటీపై ఉమ్ముతూ ఓవెన్‌లో పెడుతున్నాడు. వీడియో తీసిన వ్యక్తి దానిని ట్విట్టర్‌లో పెట్టగా అది కాస్తా.. వైరల్ అయ్యింది. గతంలోనూ ఇలా తందూరీ రోటీపై ఉమ్మడం జరిగింది. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నదే ఎవ్వరికీ అంతుపట్టని విషయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
गाजियाबाद के एक चिकन पॉइंट का वीडियो सामने आया है, जिसमें एक शख्स थूक लगाकर रोटी बनाता दिख रहा है. pic.twitter.com/utDi9Jh9F8
— Anubhav Veer Shakya (@AnubhavVeer) October 17, 2021