దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో పరమశివుడు కొలువైన ఉన్న కేదార్ నాథ్ యాత్రకు భక్తులు వేలాదిగా తరలివెళ్తుంటారు. ఎన్ని కష్టాలు పడైానా సరే పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తుంటారు.
దేశ వ్యాప్తంగా కొన్నిరోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించి ఎండాకాలంలో వర్షాలు దంచికొడుతున్నాయి. సాధారణంగా ఏప్రీల్, మే నెలలో భానుడి ప్రభావంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారు.. కానీ ఈ మద్య వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల అకాల వర్షాలు పడుతున్నాయి. కేదార్ నాథ్ లో భారీగా మంచు కురుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..
గత నెల చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22 న ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ ఎడతెరిపి లేని హిమపాతం కురుస్తుంది.. దీంతో చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇటీవల తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం మళ్లీ మూత పడింది. అంతేకాదు భారీగా మంచు కురియడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. కేదార్ నాథ్ లో కురుస్తున్న హిమపాతం వల్ల ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయాయని అధికారులు తెలిపారు. వయసు పైబడిన యాత్రికులు కొంతరు ఊపిరి అందక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. దీంతో యాత్రికులు తమ బస ప్రాంతానికి పరిమితం అయ్యారు. ఈ సందర్భంగా కేదార్ నాథ్ యాత్రకు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి లకు రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయని అన్నారు. వాతావరణ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
వయసు మీదపడినవారు.. గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజుల వరకు హిమపాతం కొనసాగే అవకాశం ఉందని రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు. ఆయల పరిసర ప్రాంతంల్లో ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తుంది.. ఏ క్షణంలో వాతావరణం ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో అడుగు తీసి అడుగు వేయలని స్థితిలో ఉంది.. కేదార్ నాథ్ లో చిక్కుకున్న యాత్రికులను గుర్రాలపై కిందకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తానికి చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యాత్రలో దాదాపు 150 మంది వరకు తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.
जय बाबा भोलेनाथ जी की #केदारनाथ #kedarnathyatra #Kedarnathyatra2023 pic.twitter.com/wM3z8DQnuE
— uttrakhand wi fi (@rajendrabhatt) May 3, 2023
प्रिय यात्रियों, आज भी श्री केदारनाथ धाम में भारी बर्फबारी जारी है। श्री केदारनाथ यात्रा आज के लिए रोकी गयी है। सभी यात्री सुरक्षित स्थानों व यात्रा पड़ावों में जहां हैं वहीं बने रहें और केदारनाथ धाम की ओर न आएं।#kedarnath #KedarnathDham #CharDhamYatra2023 #UttarakhandPolice pic.twitter.com/Q5XE8RJb8I
— Ashok Kumar IPS (@AshokKumar_IPS) May 3, 2023